NTV Telugu Site icon

Snake In Toilet : అర్జంట్‎గా టాయిలెట్‎కి వెళ్లాల్సి వచ్చింది.. డోర్ ఓపెన్ చేయగానే షాక్

Snake In Toilet

Snake In Toilet

Snake In Toilet : అస్ట్రేలియాలో వేసవి కాలం వచ్చిందంటే పాముల బెడద పెరిగిపోతుంది. ఎండ వేడి తట్టుకోలేక అవి ఇళ్లలోకి దూరిపోతుంటాయి. వేడిగా ఉన్నప్పుడు, గోడ పగుళ్లు, రిఫ్రిజిరేటర్ కింద, గ్రిల్ కింద లేదా ఎయిర్ కండీషనర్ వెనుక వంటి చల్లని ప్రదేశాలను వెతుకుతాయి. కాబట్టి, మీరు కూడా బాత్రూమ్ లేదా టాయిలెట్‌లోకి వెళ్లే ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే.. ఇలాంటి ఘటనటే చోటుచేసుకుంటాయి.

Read Also: Heavy Rains : న్యూజిలాండ్‎ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు

ఓ పాము అనుకోకుండా బాత్రూమ్‌లోకి దూరింది. మరి, ఆ తర్వాత ఏం చేసిందో ఏమో.. టాయిలెట్ పేపరుకు ఉండే గొట్టంలోకి దూరింది. దీంతో ఆ పాము టాయిలెట్ పేపర్ రోల్‌లో చిక్కుకుపోయింది. టాయిలెట్‌లో శబ్దం విని.. ఆ ఇంటి యజమాని డోరు తెరిచి చూశాడు. అంతే, అతడికి గుండె జారినట్లయ్యింది. టాయిలెట్ పేపరులో చిక్కుకున్న పాము.. ఆ బాత్రూమ్ నుంచి బయట పడేందుకు ప్రయత్నించాడు. టాయిలెట్‌లో 4 అడుగుల పాము కనిపించడంతో వెంటనే పాము పట్టేవారిని పిలిచాడు. పాము-క్యాచర్ కేటీ ఐరీని సంఘటన స్థలానికి పిలిపించారు. ఆమె పామును పట్టి స్థానిక అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Read Also:NABARD Chairman: వ్యవసాయంతో పాటు మత్స్య, సహకార రంగాలకు రుణాలు

అయితే, ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలీదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఉన్న సాదాసీదా పాము కాదు. పాములకే బాస్.. నాగు పాము. ఇదిగానీ కాటేస్తే స్పాట్‌లోనే చనిపోతారు. కాబట్టి, మీరు ఇలాంటి విషపూరిత పాములకు చిక్కకుండా ఉండాలంటే.. తప్పకుండా టాయిలెట్ చేసుకోండి. విసర్జనకు కూర్చొనే ముందు ఫ్లష్ కూడా చేయండి. దానివల్ల లోపల ఏమైనా ప్రమాదకర జీవులుంటే బయటకు పోతాయి.