NTV Telugu Site icon

Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక

Volcano Erupts

Volcano Erupts

Volcano Erupts In Indonesia, Possibility Of Tsunami: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైంది. జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్ధలైంది. 1.5 కిలోమీటర్ల మేర బూడిదను గాలిలోకి ఎగిసిపడింది. విస్పోటనం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు సూచించారు. అగ్నిపర్వతం నుంచి వస్తున్న లావకు దూరంగా ఉండాలని తెలిపింది.

Read Also: AI Predicts Heart Disease: ఒక్క ఎక్స్-రే చాలు గుండె జబ్బుల్ని కనుక్కోవడానికి..

ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. అగ్నిపర్వతం ఆదివారం ఉదయం 2.46 గంటల నుంచి విస్పోటనం చెందడం ప్రారంభించింది. ఇండోనేషియా అధికారులు సమీప ప్రాంతాల ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఇండోనేషియాలో మొత్తం 142 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతాల చుట్టూ 10 కిలోమీటర్ల లోపల దాదాపుగా 86 లల మంది ప్రజలు నివసిస్తున్నారు.

ఇండోనేషియా పూర్తిగా అగ్ని పర్వతాలు ఉన్న ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ సముద్రం దిగువన అగ్నిపర్వతాలతో పాటు టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రంగా ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఇండోనేషియా ఉంది. ఇదిలా ఉంటే హవాయిలోని మౌనాలోవా అగ్ని పర్వతం కూడా లావాను వెదజిమ్ముతూ ఉగ్రరూపం దాల్చింది. పర్వతం నుంచి లావా భారీగా బయటకు వస్తుంది.

Show comments