NTV Telugu Site icon

Vladimir Putin: మాపై దాడులకు సహకరిస్తే.. పశ్చిమ దేశాలపై అణుదాడి చేస్తాం..

Puthin

Puthin

Vladimir Putin: ఉక్రెయిన్‌- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ తీవ్రతరం చేసింది. కాగా, రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలకు వ్లాదిమీర్ పుతిన్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు సిద్ధమైనట్లు హింట్‌ ఇచ్చాడు. అమెరికా, యూకే సహయంతో ఉక్రెయిన్‌.. రష్యాపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసిందన్నారు. యూకే ప్రధాని కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారని పుతిన్ ఆరోపించారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్‌కు వచ్చిన సమాచారంతో అప్రమత్తమైంది.

Read Also: Ajmer Dargah : అజ్మీర్ దర్గాలో శివాలయం.. విచారణకు నిరాకరించిన కోర్టు

తాజాగా రష్యా భద్రతా మండలి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాట్ కామెంట్స్ చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం సపోర్టుతో దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామన్నారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించారు. ఇక, వ్లాదిమీర్ పుతిన్‌ హెచరికలు జారీ చేసిన తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేస్తుంది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను ఉపయోగించుకోవాలని రష్యా నిర్ణయించింది. ఇక, పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్‌ దాడి చేసేందుకు పర్మిషన్ ఇస్తే కీవ్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్‌ తెలిపారు.