Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా గత ఏడాదిన్నరగా రష్యాకే పరిమితమైన ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం పలు దేశాల పర్యటకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్ స్థాన్‌లో పర్యటించిన పుతిన్, ఆ తర్వాత చైనాకు వెళ్లారు.
Read Also: Uttar Pradesh: దొంగతనం చేశాడని యువకుడిని స్తంభానికి కట్టి కొట్టిన స్థానికులు
బుధవారం సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో పర్యటించేందుకు పుతిన్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వెల్లడించింది. ఉక్రెయిన్ పిల్లలపై యుద్ధ నేరాలకు పాల్పడ్డడాని చెబుతూ.. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వర్కింగ్ విజిట్‌పై అధ్యక్షుడు పుతిన్ యూఏఈ, సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం, అంతర్జాతీయ రాజకీయాలపై రష్యా అధినేత చర్చిస్తారని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సమావేశాలకు పుతిన్ హాజరు కావడం లేదు. ఇండియాలో జరిగిన జీ20 సమావేశంతో సహా, దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. పుతిన్ స్థానంలో విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ని పంపించారు.
