Russia-Ukraine War: ఏడాది గడిచినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం శీతాకాలం ముగియడంతో ఉక్రెయిన్ పై రష్యా మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని రష్యా చరిత్రలో మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ పై మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రానున్న మూడు నెలల పాటు ఉక్రెయిన్లపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Read Also: Rahul Gandhi: ఉగ్రవాదులు నన్ను చూశారు, నేను వారిని చూశాను.. కానీ వారు ఏం అనలేదు..
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలహీనత, వైఫల్యం, అసమర్థతను బయటపెడుతున్నాయని, వందలాది మంది సైనికులను యుద్ధంలోకి పంపి, వారి జీవితాలను దుర్భరంగా మార్చుతోందని వెస్ట్రన్ మీడియా దుయ్యబడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వచ్చిన ఓ నివేదిక, పుతిన్ మూడు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. రష్యా చర్యలు పొరుగు దేశాలను కూడా ఇబ్బందులు పెడుతున్నాయని, రెండోది ఉక్రెయిన్ దేశానికి పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధ సహాయం చేయడంలో పురోగతి ఉందని, మూడోది పుతిన్ చేస్తున్న యుద్ధంపై రష్యా మిలిటరీ విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్ లోని బఖ్ ముత్ నగరంపై పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిని హస్తగతం చేసుకుంటే ఉక్రెయిన్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెస్ట్రన్ దేశాల నుంచి మరింత సాయాన్ని కోరుతున్నారు. ఏడాదిగా జరుగుతున్న యుద్ధం వల్ల 7000 మంది పౌరులు చనిపోయారు. 80 లక్షల మంది తమ నివాసాలను వదిలివెళ్లిపోయారు. చాలా పట్టణాలు, నగరాలు రష్యా దాడితో మసిదిబ్బగా మారాయి.