NTV Telugu Site icon

Yacht Sinks Off: చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక.. వీడియో వైరల్

Superyacht Sinks Off

Superyacht Sinks Off

Yacht Sinks Off: సముద్రంలో అనేక కారణాల వల్ల ఓడలు, పడవలు మునిగిపోతుంటాయి. కొన్ని సార్లు సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఎన్నో సార్లు మునిగిపోతుంటాయి. తాజాగా వాతావరణ కారణాల వల్ల ఓ భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇటాలియన్‌ కోస్ట్ గార్డ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఓ సూపర్‌ నౌక పూర్తిగా మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు చూపించే వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వివరాల ప్రకారం.. ఇటాలియన్ కోస్ట్ గార్డుకు చెందిన నౌక గల్లిపోలీ నుంచి మిలాజోకు ప్రయాణిస్తుంది. అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. అందరు చూస్తుండగానే.. 40 మీటర్ల భారీ పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో వణికిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో తేలుతున్న 9 మందిని రక్షించారు. ఆ తొమ్మిది మందిలో నలుగురు ప్రయాణికులు కాగా.. మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నౌక మునగడానికి గల కారణాల గురించి విచారణ ప్రారంభమైంది.

Excise Policy Probe: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మనీలాండరింగ్ కేసు

ఇది వాతావరణం, సముద్ర పరిస్థితులు క్షీణించడం వల్ల సముద్రంలో మునిగిపోయిందని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. 2007లో మొనాకోలో నిర్మించిన ఈ పడవకు ‘సాగా’ అని పేరు పెట్టినట్లు డైలీ మెయిల్ తెలిపింది. తీరానికి 14.5 కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొంది. మునిగిపోయిన నౌకను సురక్షితంగా ఓడరేవుకు లాగేందుకు కోస్ట్ గార్డ్ ఒక టగ్‌బోట్‌ను పంపింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ భారీ నౌక మునిగిపోయింది. ఓడ మునిగిపోవడానికి గల కారణాన్ని కనుగొనడానికి అధికారులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. నౌక మునిగిపోయే ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు.