NTV Telugu Site icon

Twitter: ఇకపై ట్విట్టర్‌లో వీడియో కాల్‌ …. కొత్త ఫీచర్‌కు శ్రీకారం

Twitter

Twitter

Twitter: ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్న వారు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం.. అలాగే వారి వ్యాపారార్థం కొన్ని సోషల్‌ మీడియా సంస్థలు కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియోలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇకపై ట్విట్టర్‌లో కూడా వీడియో కాల్‌ చేసుకొనేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ట్విట్టర్‌లో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విట్టర్‌ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. సోషల్‌ మీడియా యాప్‌ స్థాయి నుంచి సూపర్‌ యాప్‌గా మారేందుకు ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్) వేగంగా అడుగులు వేస్తోంది. ఎక్స్‌గా పేరు మార్చుకున్న తర్వాత కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. త్వరలో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. దాంతోపాటు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు పోస్ట్‌ చేయడం, కంటెంట్‌ క్రియేటర్‌ సబ్‌స్క్రిప్షన్‌, డిజిటల్‌ చెల్లింపులు వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు లిండా తెలిపారు.

Read also

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఉన్న ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి ఉంచినట్టు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించాడు. ట్విట్టర్‌ కార్యాలయంలోని కాఫీ టేబుల్స్‌, భారీ పక్షి పంజరాలు, వైరల్‌గా మారిన ఆయిల్‌ పెయింటింగ్స్‌, డెస్క్‌లు, డీజే బూత్‌, మ్యూజికల్‌ పరికరాలు మొత్తం 584 వస్తువులను వేలానికి ఉంచినట్లు ఆంగ్ల వార్తా సంస్థ కథనాల ప్రకారం తెలుస్తోంది. వేలంలో వస్తువుల ప్రారంభ ధర 25 డాలర్లుగా నిర్ణయించాడు. సెప్టెంబరు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ వేలం ప్రక్రియ జరగనున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్‌ను సూపర్‌ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్‌గా పేరు మార్చినట్లు మస్క్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చైనా వీచాట్‌ తరహాలో సోషల్‌ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్‌, ఫుడ్ డెలివరీ, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, బ్యాంకింగ్‌, నగదు వ్యాలెట్‌లు, క్యాబ్‌ బుకింగ్‌, టికెట్‌ బుకింగ్‌ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ తెలిపారు. అయితే వీడియో కాల్‌ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది స్పష్టంగా చెప్పకపోయినా.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించారు.