Twitter: ఇకపై ట్విట్టర్‌లో వీడియో కాల్ …. కొత్త ఫీచర్‌కు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో వాట్సాప్‌లో వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న వారు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం.. అలాగే వారి వ్యాపారార్థం కొన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియోలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇకపై ట్విట్టర్‌లో కూడా వీడియో కాల్ చేసుకొనేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ట్విట్టర్‌లో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. సోషల్ మీడియా యాప్ స్థాయి నుంచి సూపర్ యాప్‌గా మారేందుకు ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) వేగంగా అడుగులు వేస్తోంది. ఎక్స్‌గా పేరు మార్చుకున్న తర్వాత కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. త్వరలో యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. దాంతోపాటు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు పోస్ట్ చేయడం, కంటెంట్ క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్, డిజిటల్ చెల్లింపులు వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు లిండా తెలిపారు.
Read also
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోని వస్తువులను వేలానికి ఉంచినట్టు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ కార్యాలయంలోని కాఫీ టేబుల్స్, భారీ పక్షి పంజరాలు, వైరల్‌గా మారిన ఆయిల్ పెయింటింగ్స్, డెస్క్‌లు, డీజే బూత్, మ్యూజికల్ పరికరాలు మొత్తం 584 వస్తువులను వేలానికి ఉంచినట్లు ఆంగ్ల వార్తా సంస్థ కథనాల ప్రకారం తెలుస్తోంది. వేలంలో వస్తువుల ప్రారంభ ధర 25 డాలర్లుగా నిర్ణయించాడు. సెప్టెంబరు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ వేలం ప్రక్రియ జరగనున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్‌ను సూపర్ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్‌గా పేరు మార్చినట్లు మస్క్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే చైనా వీచాట్ తరహాలో సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, బ్యాంకింగ్, నగదు వ్యాలెట్‌లు, క్యాబ్ బుకింగ్, టికెట్ బుకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ తెలిపారు. అయితే వీడియో కాల్ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది స్పష్టంగా చెప్పకపోయినా.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!