Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- వెనిజులా భూకంపంలో అద్భుతం
- 8 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- 100 గంటల రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులాలో జూన్ 24న సంభవించిన భారీ భూకంపాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ విషాదంలోనూ ఆశాకిరణంలా నిలిచిన ఓ అద్భుత ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోర్స్ భూకంపం తర్వాత ఎనిమిది రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకుపోయినా సజీవంగా బయటపడటం విశేషంగా మారింది.
100 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షణ
హెర్నాన్ను రక్షించేందుకు సహాయక బృందాలు దాదాపు 100 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించాయి. చివరకు గురువారం తెల్లవారుజామున అతడిని సురక్షితంగా బయటకు తీశాయి. ఆక్సిజన్ మాస్క్‌తో స్ట్రెచర్‌పై అతడిని బయటకు తీసుకొస్తుండగా అక్కడున్న ప్రజలు, వివిధ దేశాల నుంచి వచ్చిన రెస్క్యూ సిబ్బంది చప్పట్లతో స్వాగతం పలికారు. పలువురు రక్షక సిబ్బంది ఆనందంతో అతడిని కౌగిలించుకుని ఈ ఘటనను “అద్భుతం”గా అభివర్ణించారు.
Also Read
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
చిన్న గాలి ఖాళీ ప్రాణాలను కాపాడింది
హెర్నాన్ లా గువైరాలోని గలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్లో రాత్రి షిఫ్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో అతను తన సెక్యూరిటీ క్యాబిన్లో ఉన్నాడు. భవనం పూర్తిగా కూలిపోయినప్పటికీ, అతను ఉన్న చిన్న క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాలేదు. దీంతో అతని చుట్టూ చిన్న గాలి ఖాళీ (ఎయిర్ పాకెట్) ఏర్పడి, ఎనిమిది రోజుల పాటు అతని ప్రాణాలను కాపాడింది.
నీరు, ద్రవ ఆహారంతో బతికించారు
సహాయక సిబ్బంది కొన్ని రోజుల తర్వాత హెర్నాన్తో మొదటిసారి సంబంధం ఏర్పరచుకున్నారు. అనంతరం శిథిలాల మధ్య ఏర్పరిచిన ఇరుకైన మార్గం ద్వారా అతనికి నిరంతరం నీరు, ద్రవ ఆహారం అందించారు. ఎడతెరిపి లేని వర్షాలు, పదేపదే వస్తున్న ప్రకంపనలు, శిథిలాల అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ, బృందాలు అత్యంత జాగ్రత్తగా సొరంగం తవ్వి అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.
భార్యకు కొత్త ఆశ
రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న కోస్టారికా రెడ్ క్రాస్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మొదట హెర్నాన్తో మాట్లాడినప్పుడు తన భార్య తాను మరణించానని భావిస్తోందని, తాను ఇంకా బతికే ఉన్న విషయం వెంటనే చెప్పవద్దని కోరాడట. హెర్నాన్ భార్య గుస్బిమార్ గొంజాలెజ్ మాట్లాడుతూ, చాలా రోజుల పాటు తన భర్త ఇక లేడనే భావించానని, కానీ రెస్క్యూ సిబ్బంది అతడిని గుర్తించారన్న సమాచారం తెలిసిన క్షణం నుంచి మళ్లీ ఆశ చిగురించిందని తెలిపారు. ఈ దంపతులకు 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అంతర్జాతీయ రెస్క్యూ బృందాల సహకారం
ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్‌లో వెనిజులాతో పాటు చిలీ, కోస్టారికా, అమెరికా, పోర్చుగల్, మెక్సికో, ఎల్ సాల్వడార్ దేశాలకు చెందిన నిపుణులైన సహాయక బృందాలు పాల్గొన్నాయి. టెలిస్కోప్ కెమెరాలు, ప్రత్యేక పరికరాల సహాయంతో హెర్నాన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యంత జాగ్రత్తగా రక్షణ చర్యలు చేపట్టారు.
భూకంపం సృష్టించిన భారీ విధ్వంసం
జూన్ 24న ఉత్తర వెనిజులాలో వరుసగా 7.2, 7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలతో వేలాది భవనాలు కూలిపోయాయి. ముఖ్యంగా లా గువైరా ప్రాంతం అత్యంత తీవ్రంగా దెబ్బతింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ విపత్తులో 2,295 మంది మరణించగా, 11 వేల మందికి పైగా గాయపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాల్లో లేదా ఆరుబయట తలదాచుకుంటున్నాయి. ఈ విషాదంలో హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోర్స్ ప్రాణాలతో బయటపడటం వెనిజులా ప్రజలకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఆ దేశానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..