Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35Bలను తెస్తున్న అమెరికా..
- ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం..
- మిడిల్ ఈస్ట్ వైపు మెరైన్ కమాండోలు, యూఎస్ఎస్ ట్రిపోలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే నిర్వహించిన అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన శక్తివంతమైన యుద్ధనౌక USS త్రిపోలిని రంగంలోకి దించింది. దీనికి తోడు 2500 మంది మెరైన్ కమాండోలను, F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ల ఇరాన్ వైపు పంపిస్తోంది.
USS ట్రిపోలీ ప్రత్యేకతలు ఇవే:
Also Read
USS ట్రిపోలీ (LHA-7) ఒక పెద్ద ఉభయచర దాడి నౌక. దీని బరువు 45,000 టన్నులు, పొడవు 844 అడుగులు, విలువ $3.4 బిలియన్లు. ఇది కేవలం ప్రామాణిక రవాణా నౌక మాత్రమే కాదు, ఇది ఒక ‘‘లైటనింగ్ కారియర్’’. మెరుపుదాడులు చేయగలదు. దీని డెక్ పై నుంచి F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్లను ప్రయోగించగలదు. F-35B నిలువుగా టేకాఫ్ చేయగలదు. ప్రిసిషన్ అటాక్స్ చేసే మందుగుండు సామాగ్రిని కాలి ఉంటుంది. ఈ నౌక సముద్రం నుంచి నేరుగా శత్రువుల భూభాగాలపై దాడి చేసే సత్తా ఉన్న ఎమ్ఫీబియస్ అసాల్ట్ నౌకగా రూపొందించారు. దీనిలో ఉన్న 2500 మంది మెరైన్ సైనికులు యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్‌తో భూమిపై పోరాడగలరు. ఇక స్టెల్త్ సామర్థ్యం ఉన్న F-35B విమానం ధర $130 మిలియన్లు. ఇది తన స్టెల్త్ లక్షణం వల్ల శత్రువుల రాడార్లకు చిక్కదు. యూఎస్ఎస్ ట్రిపోలి ఉభయచర దాడులకు పనిచేస్తుంది.
ఇరాన్‌పై ముప్పేట దాడికి రంగం సిద్ధం:
ఇరాన్‌పై మూడు వైపుల నుంచి దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే . USS అబ్రహం లింకన్ (CVN-72) ఇప్పటికే అరేబియా సముద్రంలో ఉంది. USS జెరాల్డ్ R. ఫోర్డ్ (CVN-78) ప్రస్తుతం రెడ్ సీలో ఉంది. ఇప్పుడు USS ట్రిపోలీ ఈ ప్రాంతానికి వేగంగా చేరుకుంటోంది. ఈ మూడు నౌకలు కలిపి, స్టెల్త్ ఫైటర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జెట్లు, దాడి హెలికాప్టర్లతో సహా మొత్తం 150 కి పైగా యుద్ధ విమానాలను తీసుకువెళుతున్నాయి. ఈ మొత్తాన్ని చూస్తే రానున్న కాలంలో ఇరాన్‌పై దాడులు తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ నేలపైకి దిగి ఆపరేషన్లు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?