Site icon NTV Telugu

Usain Bolt: బోల్డ్‌కి షాక్.. అకౌంట్ నుంచి 97 కోట్లు స్వాహా

Usain Bolt Money

Usain Bolt Money

Usain Bolt: పరుగు వీరుడు ఉసెన్ బోల్డ్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. అతని అకౌంట్‌లో నుంచి ఏకంగా 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.97 కోట్లపైనే) మాయమయ్యాయి. తాను పెట్టుబడి పెట్టిన కింగ్‌స్టన్‌ అనుబంధ కంపెనీలో స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌కి అకౌంట్‌ లింక్ అయి ఉండగా.. అందులో నుంచే ఆ డబ్బంతా హుష్‌కాకి అయ్యింది. బోల్డ్ ఇన్వెస్ట్ చేసిన షేర్‌లో నష్టాలు రావడం వల్ల.. అతని అనుమతి లేకుండా ఆ డబ్బులు మాయం చేశారు. ఈ వ్యవహారంపై బోల్డ్ తరఫు న్యాయవాది లింటన్‌ పి. గార్డన్‌ మాట్లాడుతూ.. మాయమైన ఆ డబ్బంతా బోల్ట్‌ లైఫ్‌టైమ్‌ సేవింగ్‌ డబ్బులని తెలిపాడు.

Losing Video Game: వీడియో గేమ్‌లో ఓడించినందుకు తుపాకీతో కాల్చి చంపేశాడు..

ప్రస్తుతం బోల్డ్ అకౌంట్‌లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని గార్డన్ పేర్కొన్నాడు. ఒకవేళ ఆ కంపెనీ బోల్డ్ డబ్బులను తిరిగి ఇవ్వకపోతే.. తాము కోర్టులో కేసు వేయనున్నామని చెప్పాడు. ‘‘ఇది నిజంగా షాక్‌కి గురి చేసే ఘటన. ఇలా డబ్బులు సడెన్‌గా మాయమైతే.. ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. ఆ డబ్బులన్నీ బోల్డ్ లైఫ్‌టైమ్ సేవింగ్స్‌కి చెందినవి. ప్రైవేట్ పెన్షన్ రూపంలో వాటిని పొందాలని బోల్డ్ ఇదివరకే బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు షేర్స్‌లో నష్టాలు రావడంతో, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేశారు. ఈ అంశంపై కింగ్‌స్టన్ అనుబంధ సంస్థపై కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అంటూ లాయర్ గార్డన్ చెప్పుకొచ్చాడు.

Diseases Attack India: భారత్‌పై డేంజరస్ వ్యాధుల దండయాత్ర.. తస్మాత్ జాగ్రత్త

మరోవైపు.. ఈ విషయంపై స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇది మాజీ ఉద్యోగి మోసపూరిత చర్య అని, ఈ విషయాన్ని చట్ట అమలుకు సూచించామని అందులో పేర్కొంది. జమైకా కాన్‌స్టాబులరీ ఫోర్స్ దీనిపై స్పందిస్తూ.. స్టాక్ అండ్ సెక్యూరిటీస్‌లో మోసపూరిత కార్యకలాపాలపై విచారణ జరుపుతున్నామని, ఇవి ఉసేన్ బోల్ట్ సహా ఇతర వ్యక్తుల ఖాతాలను ప్రభావితం చేసిందని పేర్కొంది. కాగా.. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్‌, దాదాపు పదేళ్ల పాటు ట్రాక్‌ అండ్‌ అథ్లెట్‌ ఈవెంట్స్‌ను శాసించాడు. పరుగుల రారాజుగా నిలిచిన ఇతను, ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించి, ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.

Pudina Juice: పుదీనా జ్యూస్‌తో.. ఈ అనారోగ్య సమస్యలకి చెక్

Exit mobile version