పుదీనాలో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. దీంతో కొన్ని అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
రోజూ భోజనానికి ముందు ఈ జ్యూస్ తాగితే.. జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.
రోజుకు మూడుసార్లు పుదీనా జ్యూస్ తాగితే.. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా ఆకుల జ్యూస్ తాగడం వల్ల.. తలనొప్పి, వికారం, తలతిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.
పుదీనా జ్యూస్ తాగినా, ఆకులు నమిలి తిన్నా.. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.
రోజూ ఉదయాన్నే పరగడుపునే పుదీనా జ్యూస్‌ను కప్పు మోతాదులో తాగితే.. శరీర బరువు తగ్గుతుంది.
పుదీనా జ్యూస్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది.
పుదీనా జ్యూస్.. డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పుదీనా జ్యూస్‌తో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, వృద్ధాప్య ఛాయలు పోతాయి.
ఈ పుదీనా జ్యూస్ శిరోజాలను సంరక్షిస్తుంది. చుండ్రు తగ్గి.. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.