NTV Telugu Site icon

US- Israel: ఇజ్రాయెల్‌కు అమెరికా యాంటీ క్షిపణి వ్యవస్థ.. మండిపడిన ఇరాన్

Us

Us

US- Israel: ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ వరుసగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా బరిలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ను అందిస్తామని ఆదివారం నాడు వెల్లడించింది. దీంతో పాటు స్వయంగా తమ దేశ సైనిక బలగాలు ఇజ్రాయెల్‌కు వెళ్లి.. అక్కడ థాడ్‌ను ఇన్‌స్టాల్ చేసి వినియోగంలోకి తీసుకొస్తారని అగ్రరాజ్యం ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రతకు అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read Also: Prashanth neel : ఎవరైనా సరే ఆరేళ్లు ఆగాల్సిందే.. నీల్ మామ లైనప్ లో నలుగురు స్టార్లు

ఇక, అగ్రజార్యం అమెరికా ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) మిస్సైల్ సిస్టమ్‌ను ఆపరేట్ చేసేందుకు సైనికులను ఇజ్రాయెల్‌కు పంపడం ద్వారా అమెరికా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. దీని వల్ల అమెరికా సైనికుల ప్రాణాలు అపాయంలో పడే అవకాశం ఉందన్నారు. యూఎస్ కు ఇజ్రాయెల్ ఎంత ముఖ్యమో.. మాకు ఇరాన్ ప్రజలు కూడా అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. అందుకోసం తాము ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ ‘ఎక్స్’ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.