NTV Telugu Site icon

Teacher: 16 ఏళ్ల స్టూడెంట్‌తో లేడీ టీచర్ శృంగారం.. తండ్రికి తెలిసినా..

Hailey Clifton Carmack

Hailey Clifton Carmack

Teacher: 16 ఏళ్ల విద్యార్థితో 26 ఏళ్ల లేడీ టీచర్ సె‌*క్స్ చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ముందుగా తాను విద్యార్థిపై ఎలాంటి అత్యాచారానికి పాల్పడలేదని చెప్పన సదరు టీచర్ తర్వాత నిజాన్ని అంగీకరించింది. డిసెంబర్ నెలలో హెలీ క్లిప్టన్-కార్మార్ అనే టీచర్ ఒక విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె డిసెంబర్ 23న టెక్సాస్‌లోని తన కుటుంబం వద్దకు పారిపోయింది. సెకండ్ డిగ్రీ అత్యాచారం, విద్యార్థితో లైంగిక సంబంధం, పిల్లల్ని వేధించడం, పిల్లల సంక్షేమానికి హాని కలిగించే అభియోగాలు మోపిన తర్వాత జనవరి 5న ఆమెని అరెస్ట్ చేశారు. ఈ నేరం నెల రోజుల పాటు సాగినట్లు తేలింది. విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న మహిళ ఈ నేరాల్లో నాలుగేళ్ల జైలు శిక్ష అనువించనుంది. అక్టోబర్ 11న ఆమెని శిక్షించే వరకు గృహనిర్భంధంలో ఉంటుంది.

Read Also: Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..

గత సంవత్సరం మిస్సౌరీలోని లాక్యూ హై స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. ఇదే కాకుండా సదరు ఉపాధ్యాయురాలు ఇతర విద్యార్థులను కాపలాగా ఉంచుకుని బాలుడితో సెక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ శృంగార అభియోగాలు వచ్చే ముందే సదరు టీచర్‌ని విద్యార్థులతో చాలా సన్నిహితంగా ఉన్నందున పాఠశాల హెచ్చరించింది. పాఠశాలలో టీచర్‌గా చేరడమే ఆమె మొదటి ఉద్యోగం. బాలుడిపై అత్యాచారాల్లో కొన్ని స్కూల్ ఆవరణలోనే జరిగాయి. ఈ లైంగిక కార్యకలాపాల గురించి ఓ స్టూడెంట్, వారి అక్రమ సంబంధం గురించి స్కూల్ రిసోర్స్ ఆఫీసర్‌కి నివేదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి వీపుపై టీచర్ క్లీఫ్టర్ కార్మాక్ చేసిన గాయాలను పోలీసులకు చూపించాడు.

ముందుగా సదరు టీచర్ విద్యార్థితో ఉన్న శృంగార సంబంధాన్ని నిరాకరించింది. అయితే, ఆమె మొబైల్ ఫోన్‌లో విద్యార్థితో చేసిన మెసేజులు వీరి మధ్య అనుచిత సంబంధాన్ని తెలియజేసింది. ఇదిలా ఉంటే, వీరిద్దరి సంబంధం గురించి బాలుడి తండ్రి మార్క్ క్రైటన్‌కి కూడా తెలుసని తేలింది. అయితే, క్రైటన్ తన కొడుకుతో, టీచర్ లైంగిక సంబంధం కొనసాగించేందుకు అనుమతించినట్లు కోర్టు పత్రాలు పేర్కొన్నాయి. వీరిద్దరి సంబంధాన్ని దాచి ఉంచేందుకు అధికారులకు సమాచారం ఇవ్వలేదని అతడిపై అభియోగాలు మోపబడ్డాయి.

Show comments