Site icon NTV Telugu

Submarine Attack: ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ సబ్‌మెరైన్ దాడి.. వీడియో వైరల్..

Iran War (1)

Iran War (1)

Submarine Attack: భారత్‌లో జరిగిన నేవీ విన్యాసాలైన మిలన్ 2026లో పాల్గొని, తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి ముంచేసింది. సబ్‌మెరైన్ నుంచి టార్పిడోల ద్వారా యుద్ధ నౌకపై దాడి జరిగింది. ఈ దాడితో పెద్ద శబ్ధంతో నౌక పేలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దాడి తర్వాత ఒక్కసారిగా నౌక ఎగిరిపడింది. పెద్ద ఎత్తున సముద్రం నీరు ఆకాశానికెగిశాయి. సబ్‌మెరైన్ పెరిస్కోప్ ద్వారా దూరంలో నౌక పేలిపోతున్న దృశ్యాలను రికార్డ్ చేశారు. ఇరాన్ యుద్ధ నౌక్ ఇంత దగ్గరగా వచ్చిన సబ్‌మెరైన్ ను కూడా గుర్తించలేకపోవడం గమనార్హం.

Read Also: Rajshri Deshpande: ప్రముఖ నటికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. సోషల్‌ మీడియాలో ఎమోషన్‌ పోస్ట్..

మిలన్ 2026లో పాల్గొనడానికి భారత్ కు వచ్చినప్పటి నుంచి ఇరాన్ యుద్ధ నౌకను గమనిస్తుందా అనేది ఇంకా తెలియదు. భారత్ వెళ్తున్న సమయంలోనే దీనిని యూఎస్ సబ్‌మెరైన్ ట్రాక్ చేసి ఉండొచ్చని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఒక అమెరికన్ జలాంతర్గామి అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందని భావించిన ఇరానియన్ యుద్ధనౌకను ముంచివేసింది.’’ అని యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధ్రువీకరించారు.

శ్రీలంకకు దక్షిణ తీరంలో హిందూ మహాసముద్రంలో ఈ దాడి జరిగింది. అంతర్జాతీయ జలాల్లో ఘటన చోటుచేసుకుంది. దాడి తర్వాత వెంటనే ఎమర్జె్న్సీ సిగ్నల్ నౌక నుంచి రావడంతో, శ్రీలంక మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఘటన జరిగిన సమయంలో నౌకలో 180 మంది ఉన్నారని, ఇందులో 87 మంది మరణించినట్లు లంక అధికారులు తెలిపారు. 32 మందిని రక్షించామని, మిగతా వారు గల్లంతైనట్లు తెలిపారు.

Exit mobile version