US-Iran War: టార్గెట్ ‘‘ఖార్గ్ ఐలాండ్’’.. భూతల దాడులకు అమెరికా సిద్ధం..
- ఖార్గ్ ఐలాండ్ లక్ష్యంగా అమెరికా దాడులు..?
- ఇరాన్ కీలక ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్లాన్‌లో యూఎస్..
- భూతల దాడులు చేయాలనే ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల దాటింది. ఇప్పటికీ పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు, అమెరికా దాడుల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమై ఉన్న యూఎస్ బలగాలు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ‘‘భూతల దాడులకు’’ సిద్ధమవుతోంది. ఇరాన్‌లో వారాల తరబడి భూతల దాడులు నిర్వహించేందుకు పెంటగాన్ సిద్ధమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ శనివారం నివేదించింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సాధారణ పదాది దళాలు ఇందులో భాగంగా ఉండచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ప్రణాళికకు ట్రంప్ ఆమోదం తెలుపుతారా.? లేదా? అనేది ఇంకా సస్పెన్స్‌గా మారింది. భూతల దాడులు పూర్తిస్థాయి ఇరాన్ ఆక్రమణగా మారదని నివేదిక పేర్కొంది.
Read Also: Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ముఖ్యంగా, ఇరాన్ ఆయువుపట్టుగా ఉన్న ‘‘ఖార్గ్ ద్వీపాన్ని’’ స్వాధీనం చేసుకునే దిశగా భూతల దాడులు ఉండే అవకాశం ఉంది. ఇరాన్ అతిపెద్ద చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో 90 శాతం ఖార్గ్ ఐలాండ్ నుంచే జరుగుతున్నాయి. ఇదే కాకుండా, అంతర్జాతీయ నౌకయానానికి హార్ముజ్ జలసంధిలో అడ్డుగా ఇరాన్ కోస్టల్ ఇన్‌స్టాలేషన్లను ధ్వంసం చేయాలనేది అమెరికా ప్లాన్. ఇరాన్ వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకునే దిశగా భూతలదాడులు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే వేల సంఖ్యలో యూఎస్ మెరైన్స్, 82న ఎయిర్‌బోర్న్ డివిజన్ బలగాలను ఇప్పటికే మధ్యప్రాచ్యంలో మోహరించాయి. అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెప్పరని, యుద్ధం ఆపకపోతే నరకాన్ని చూపిస్తారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివీట్ హెచ్చరించారు. అయితే, అమెరికా అనుకున్నంత ఈజీగా ఈ ఆపరేషన్ సాగకపోవచ్చు. ఇరాన్ మెయిన్ ల్యాండ్ నుంచి 25 కి.మీ దూరంలో ఖార్గ్ ద్వీపం ఉంటుంది. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ సైన్యం ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉంది. ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం సులభమే అయినప్పటికీ, యూఎస్ తన సైన్యాన్ని రక్షించుకోవడం సవాలుతో కూడుకున్నదిగా మారుతుంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?