NTV Telugu Site icon

Middle East Tensions: ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా.. మిడిల్‌ఈస్ట్‌కి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్స్..

Middle East Tensions

Middle East Tensions

Middle East Tensions: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటం, హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చిడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతల్ని పెంచింది. ఇరాన్ గడ్డపై హనియే హత్యచేయబడటంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. అయితే, హనియే హత్యపై ఇప్పటికీ ఇజ్రాయిల్ సైలెంట్‌గానే ఉంది. ఇరాన్‌తో పాటు హమాస్ మాత్రం ఇది ఇజ్రాయిల్ చేసిన హత్యే అని ఆరోపిస్తున్నాయి. దీనికి ఇజ్రాయిల్‌పై తప్పక ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన సైన్యాన్ని ఇజ్రాయిల్‌పై దాడికి ఆదేశించినట్లు వార్తలు వెలువతున్నాయి.

Read Also: Israel: అల్ జజీరా జర్నలిస్టుని చంపిన ఇజ్రాయిల్.. హమాస్‌కి సాయం చేస్తున్నాడని ఆరోపణ..

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా నిలుస్తోంది. ఏ క్షణానైనా దాడులు చేసే అవకాశం ఉండటంతో మిడిల్ ఈస్ట్‌లో తన సైనిక ఉనికిని పెంచుతోంది. యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను మోహరించినట్లు పెంటగాన్ శుక్రవారం తెలిపింది. ఇరాన్, దాని భాగస్వాముు, ప్రాక్సీల ద్వారా ప్రాంతీయ ఉద్రిక్తతల్ని తగ్గించడానికి రక్షణ శాఖ చర్యలు తీసుకుంటూనే ఉంది అని డిప్యూటీ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ తన మిత్రదేశాలు లెబనాన్, ఇరాక్, సిరియాలతో కలిసి ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు లెబనాన్ నుంచి హిజ్బుల్లా తాజాగా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్ దాడులు చేసింది.