NTV Telugu Site icon

H-1B Visas: అమెరికన్‌ ఉద్యోగులకు హెచ్‌-1బీ వీసా ముప్పు.. చట్ట సవరణకు ప్రతిపాదన

Us

Us

H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్‌ ఉద్యోగులను తొలగించడానికే హెచ్‌-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు. హెచ్‌-1బీ వీసాలకు ఛాన్స్ కల్పిస్తున్న లాకెన్‌ రిలే చట్టాన్ని సవరించాలని కోరుతూ చట్టసభలో ఒక ప్రతిపాదనను అతడు ప్రవేశ పెట్టారు. హెచ్‌-1బీ వీసాల కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Sukriti Veni: సుకుమార్ పై సంచలన కామెంట్స్ చేసిన కూతురు

ఇక, ఈ వీసా ద్వారా లభించే ఆదాయంతో 20 వేల మంది అమెరికన్‌ స్టూడెంట్స్ కు ఉపకార వేతనాలు ఇవ్వవచ్చని బెర్నీ శాండర్స్ తెలిపారు. హెచ్‌-1బీ వీసా కార్మికులకు కంపెనీలు చెల్లించే వేతనాలను కూడా భారీగా పెంచాలని అతడు డిమాండ్‌ చేశారు. తక్కువ వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను నియమించుకోవడం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు భారీ మొత్తంలో డబ్బును మిగుల్చుకునేందుకు అవకాశం ఉంటుందని విమర్శించారు. హెచ్‌-1బీ వీసాలను సమర్థిస్తున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్, భారతీయ అమెరికన్‌ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామిలపైనా బెర్నీ శాండర్స్‌ విమర్శలు గుప్పించారు.