Teacher: అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఒక గైడెన్స్ కౌన్సిలర్ 2022లో 14 ఏళ్ల విద్యార్థిపై లైంగికంగా వేధించినట్లు తేలింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. పెన్సిల్వేనియా మిడిల్ స్కూల్ టీచర్‌గా ఉన్న 35 ఏళ్ల కెల్లీ అన్ షుట్టే అనే మహిళ, 2022 వేసవి ప్రారంభంలో అదే స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. బాలుడిపై లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు పాల్పడింది. బక్స్ కౌంటీలోని పెన్‌రిడ్జ్ సౌత్ మిడిల్ స్కూల్ లో గైడెన్స్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్న సమయంలో కెల్లి, 14 ఏళ్ల వయసులో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది.
Read Also: Girlfriend Harassment: విశాఖ లో దారుణం.. ప్రియురాలు వేధిస్తుందని ప్రియుడు ఆత్మహత్య..
జూలై నెలలో కెల్లి ఇంటిలో ఇద్దరు ముద్దుపెట్టుకోవడాన్ని ఆమె బందువు ఒకరు చూశారు. సదరు కుటుంబ సభ్యుడు కూడా అదే స్కూల్ లో పనిచేస్తున్నాడు. దీనిపై పెన్సిల్వేనియా పోలీసులకు వివరాలు అందించారు. ఇలా కెల్లి, బాలుడు ముద్దుపెట్టుకుంటున్న తరుణంలో తాను ఇంటి లోకి వెళ్లి బాలుడిని బయటకు వెళ్లాల్సిందిగా కోరానని, పరిగెత్తుకుంటూ వచ్చని వ్యక్త భయంతో అతని తల్లిదండ్రులకు పికప్ చేసుకోవాలని కోరాడు.
సదరు బాలుడు తాను కెల్లితో సెక్సువల్ రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పాడు. అతని తల్లి మరుసటి రోజు పోలీసులకు ఫోన్ చేసింది. నివేదిక ప్రకారం.. 2022 చివరిలో బాలుడు క్లాస్ ట్రిప్ లో ఉన్న సమయంలో బస్సులో టీచర్ కెల్లీ పక్కనే కూరన్చున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత నుంచి కెల్లీ, బాలుడిని తరుచుగా ఆఫీసుకు పిలుస్తుండేదని, క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా పిలిచేదని, వీరిద్దరి మధ్య మెసేజులు కూడా నడిచాయని విచారణలో తేలింది.
ఆ తరువాత వీరిద్దరు ఫిజికల్ రిలేషన్ లోకి వెళ్లారు. గతేడాది జూన్, జూలై నెలల్లో కెల్లీ, తనతో పలుమార్లు లైంగికంగా కలిసినట్లు బాలుడు వెల్లడించారు. సమాచారం ప్రకారం కెల్లీ తన ఇంట్లోని బెడ్రూంలో బాలుడితో శృంగారంలో పాల్గొందని, ఆ తరువాత కారులో కూడా ఇలాగే బాలుడిని లైంగికంగా వేధించిందని తేలింది. పోలీస్ విచారణలో విద్యార్థి ఇంటిలో టీచర్‌కి సంబంధించిన ఇయర్ రింగ్స్ కనుగొన్నారు. వారి మధ్య మెసేజెస్, ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. టీచర్ కెల్లీని శుక్రవారం విచారించారు.
