Site icon NTV Telugu

Ukraine War: అణుదాడికి సంకేతాలు ఏమి లేవు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా..

Ukraine War

Ukraine War

Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.

Read Also: Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని సియోనిలో భూకంపం.. తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

రష్యా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఎలాంటి సూచనలు లేవని జిన్ పియర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా క్రూరంగా దాడి చేసిందని, రష్యా దురాక్రమణ నుంచి తమ ప్రజలను, భూ భాగాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇస్తామన్నారు.

బుధవారం రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. ఆ దేశ అణ్వాయుధ శక్తిని ప్రశంసించారు. తమ దేశానికి ముప్పు వాటిల్లితే అణు ఆయుధాలను మోహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. రష్యాలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అమెరికా అభిప్రాయపడుతోంది. మరో ఆరేళ్ల పాటు అధికారంలో ఉండేందుకు పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కి మద్దతుగా మరో 300 మిలియన్ డాలర్ల అత్యవసర ఆయుధ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు మంగళవారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. అయితే, యూఎస్ కాంగ్రెస్ దీన్ని అడ్డుకుంది.

Exit mobile version