NTV Telugu Site icon

USA: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అమెరికా స్పందన ఇదే..

Usa, Modi

Usa, Modi

US Reply To Query On BBC Documentary Critical Of PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చరచ్చ అవుతోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీ మీడియా రిపోర్టుపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. యూకే ఎంపీలు కూడా ఈ డాక్యుమెంటరీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. పాకిస్తాన్ మూలలు ఉన్న ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందంటూ దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే మరికొంతమంది ఎంపీలు మోదీకి మద్దతు పలికారు.

Read Also: Madhy Pradesh: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ..

తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఈ డాక్యుమెంటరీపై స్పందించింది. విలేకరులు ఈ డాక్యుమెంటరీపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని ప్రశ్నించారు. దీనిపై ఆయన ‘మీరు ప్రస్తావిస్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు’ అని చెప్పారు. అయినప్పటికీ అమెరికా, భారత్ రెండు అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా, భాగస్వామ్య విలువలు నాకు బాగా తెలుసు అని అన్నారు. భారతదేశంతో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే అనేక అంశాలు ఉన్నాయని.. రాజకీయంగా, ఆర్థిక, ప్రజల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని అన్నారు.

అంతకుముందు ఈ డాక్యుమెంటరీపై బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఎంపీ ఇమ్రాన్ హుస్సెన్ దీనిపై చర్చను లేవనెత్తారు. దీనిని యూకే ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ హింస జరిగినా.. మేం సహించం అని.. అయితే ప్రధాని మోదీ పాత్ర ఉందని నేను ఏకీభవించనని.. వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. 2002 గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉందని బీబీసీ డాక్యుమెంటరీలో ఆరోపించింది.