NTV Telugu Site icon

Joe Biden: అమెరికా అధ్యక్షుడి భారత్‌ పర్యటన… సెప్టెంబర్‌ 7 నుంచి 10 వరకు

Joe Biden

Joe Biden

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో నాలుగు రోజులపాటు ఇండియాలో పర్యటించనున్నట్టు అమెరికా వైట్‌ హౌజ్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 7 నుంచి 10 వరకు జో బైడెన్‌ ఇండియాలో పర్యటిస్తున్నట్టు స్పష్టం చేసింది. వచ్చే నెలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించనున్నారు. అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశాల సందర్భంగానే జో బైడెన్‌ భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలను కూడా జరుపుతారని సల్లివన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తరువాత భారత్‌‌కి రావడం ఇదే తొలిసారి.

Read Also: Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సెలబ్రెటీలు, ట్విటర్ వేదికగా కోరుకున్న సౌత్ స్టార్స్

జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9 మరియు 10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నాయకుల అతిపెద్ద సమావేశాలలో ఒకటిగా భావిస్తున్నారు. డిసెంబర్ 1, 2022న ఇండోనేషియా నుండి G20 ప్రెసిడెన్సీని భారతదేశం స్వీకరించింది. “అధ్యక్షుడు బిడెన్ మరియు G20 భాగస్వాములు స్వచ్ఛమైన ఇంధన పరివర్తన మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధం యొక్క ఆర్థిక మరియు సామాజిక ప్రభావాలను తగ్గించడం వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అనేక ఉమ్మడి ప్రయత్నాలను చర్చిస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్రే తెలిపారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు పేదరికంపై మెరుగ్గా పోరాడేందుకు ప్రపంచ బ్యాంకుతో సహా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడంపై చర్చించనున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభినందించనున్నట్టు ప్రకటించారు. న్యూఢిల్లీలో ఉన్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ G20కి ప్రధాని మోడీ నాయకత్వాన్ని మెచ్చుకుంటారుని.. 2026లో హోస్ట్ చేయడంతో సహా ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా G20కి US నిబద్ధతను పునరుద్ఘాటిస్తారు ప్రకటనలో స్పష్టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జీ20 సమ్మిట్‌ జరుగగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆ తేదీల్లో ఢిల్లీలోని అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసివేయనున్నారు.