NTV Telugu Site icon

Donald Trump: ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను..

Trump

Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రిపబ్లిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ ఓ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. ఇప్పుడే విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.. కాగా, ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు డొనాల్డ్ ట్రంప్.

Read Also: Electric Bill: అయ్యయ్యో.. 15 సంవత్సరాలుగా పక్కింటి వారి విద్యుత్ బిల్లును కడుతున్న వ్యక్తి..

అయితే, మేం ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదు అని మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాంటి ఆలోచనే కూడా రావడం లేదు.. తప్పకుండా గెలిచి తీరుతాం.. ఒకవేళ మేం ఓడిపోతే.. 2028లో జరిగే ఎన్నికల్లో నేను బరిలోకి దిగను అని తేల్చి చెప్పారు. ఇప్పుడు నేను విజయం సాధిస్తే దాని వెనక ముగ్గురు కీలక పాత్ర ఉండబోతుంది.. కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్, తుల్సి గబ్బార్డ్‌కు చాలా విషయాలపై అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నడీ వర్క్ చేయబోతున్నారు.. అలాగే, దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్‌ కీలక పాత్ర పోషించనున్నారు. పరిపాలనలో తుల్సికి చాలా అనుభవం ఉందని చెప్పారు. మేం వచ్చిన 12 నెలల్లోనే ఇంధనం ధరలను 50 శాతానికి తగ్గించేందుకు ట్రై చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం కార్లు మాత్రమే కాకుండా.. ఇతర వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Read Also: Ravichandran Ashwin: ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు: అశ్విన్‌

డెమోక్రటిక్‌ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ఇటీవల జరిగిన డిబేట్‌లో ట్రంప్‌ తడబాటు పడ్డారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో మరోసారి కమలాతో ఓపెన్‌ డిబేట్‌ చేయబోనని మాజీ ప్రెసిడెంట్ ప్రకటించారు. అక్టోబర్ 23న సీఎన్‌ఎన్‌ వేదికగా జరగబోయే డిబేట్‌కు తాను సిద్ధంగా ఉన్నాను.. ట్రంప్‌ కూడా అంగీకరించాలని కమలా హారిస్‌ డిమాండ్ చేశారు. కానీ, ట్రంప్ మాత్రం తప్పించుకొనేందుకు కారణాలను వెతికే పనిలో పడ్డారని ఆమె తెలిపారు. తాజాగా ఎన్‌బీసీ న్యూస్‌ రిలీజ్ చేసిన పోల్‌లోనూ కమలా హారిస్‌ 5 పాయింట్లతో ముందంజలో ఉంది. కమలాహారిస్‌కు 48 శాతం, డొనాల్డ్ ట్రంప్‌నకు 40 శాతం మంది సపోర్టు ఇచ్చారు. మరో మూడు పాయింట్లు ఎర్రర్ మార్జిన్‌ ఉన్నట్లు ఎన్‌బీసీ ప్రకటించింది.