Site icon NTV Telugu

Viral Video: సైకిల్‌పై నుంచి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Joe Biden Cycling

Joe Biden Cycling

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైకిల్‌పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్‌ పేర్కొంది. జో బైడెన్‌ తన భార్య జిల్‌ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్‌ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్‌ శనివారం సైకిల్‌ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్‌ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్‌ చేసుకోలేక పోవడంతో దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ తదుపరి తనంతట తానే లేచిన బైడెన్‌.. బాగానే ఉన్నానని, తనకేం కాలేదని చెప్పారు. అనంతరం అక్కడ గుమిగూడిన స్థానికులు, మీడియాతో మాట్లాడేందుకు బైడెన్‌ సైకిల్‌ ఆపారు. సైకిల్‌ పెడల్‌ పై నుంచి కాలును ఒక్కసారిగా తీయడంతో బ్యాలెన్స్‌ కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, వైద్యం అవసరం లేదని వైట్‌హౌస్‌ కార్యాలయం పేర్కొంది.

ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింత తెగ వైరల్‌ అవుతోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 79 ఏళ్ల జో బైడెన్‌, డెలావేర్ రాష్ట్రంలోని బీచ్ హోమ్ వద్ద కుటుంబంతో గడుపుతున్నారు.

https://twitter.com/Levi_godman/status/1538167331276341250?cxt=HHwWhICynbnC1dgqAAAA

Exit mobile version