Site icon NTV Telugu

Joe Biden: జో బైడెన్ మళ్లీ తడబాటు.. ఓ దేశాన్ని.. నగరం అంటూ సంబోధన

Joebiden

Joebiden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు రీత్యా ఏం చేస్తున్నారో.. ఏ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆయన తీరు విమర్శల పాలైంది. తాజాగా ఆఫ్రికా పర్యటనలో కూడా జో బైడెన్ తీరు విమర్శల పాలైంది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు నాగబాబు కీలక ట్వీట్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలం జనవరిలో ముగుస్తుంది. కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి 20న ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే జో బైడెన్ ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని అంగోలా దేశంలో పర్యటిస్తున్నారు. అక్టోబర్‌లోనే పర్యటించాల్సి ఉండగా.. అమెరికా ఎన్నికల నేపథ్యంలో పర్యటించడం కుదరలేదు. మొత్తానికి సోమవారం అంగోలాలోని లువాండాలో బైడెన్ అడుగుపెట్టారు. అక్కడ భారీ స్వాగతం లభించింది. అంగోలాలో అమెరికా అధ్యక్షుడిగా పర్యటించడం ఇదే తొలిసారి. ఇక పర్యటనలో భాగంగా అంగోలా అధ్యక్షుడు జోనో లౌరెన్‌కో‌తో బైడెన్ సమావేశం అయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి: Minister Narayana: క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం-హిందూపురం యూడీఏలపై మంత్రి సమీక్ష.. వాటిపై ఫోకస్‌..

అంగోలా పర్యటనలో ఉన్న జో బైడెన్ మాట్లాడుతూ.. అంగోలా దేశాన్ని నగరం అంటూ సంబోధించారు. ‘‘అంగోలా శక్తివంతమైన నగరం, నేను చూస్తున్నాను. అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే నగరం కాదు అంటూ సరిదిద్దుకున్నారు. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలం ‘ఎనిమిదేళ్లు’ కొనసాగిందని అన్నారు. వెంటనే సరిచేసుకుని నాలుగేళ్లు అంటూ సరిదిద్దుకున్నారు. బైడెన్ తడబాటుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టానున్నారు. భారీ మెజార్టీతో ట్రంప్ విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో పర్యటిస్తు్న్నారు. వయసు రీత్యా బైడెన్ ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.

 

 

Exit mobile version