Site icon NTV Telugu

US President Election 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్.. బైడెన్ ఔట్.. !

Baiden

Baiden

US President Election 2024: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే పోటీలో నిలిచింది. భారతీయ- ఆఫ్రికన్ మూలానికి చెందిన కమలా హారిస్ పేరును బైడెన్ సిఫార్సు చేశారు. ఈ ఏడాది కమలా హారిస్‌ను మా పార్టీ అభ్యర్థిగా చేయడానికి నా పూర్తి మద్దతు, సహకారం అందించాలని కోరుకుంటున్నాను అని జో బైడెన్ ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఏకమై ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది అని బైడెన్ తెలిపాడు.

Read Also: Bhavishyavani: తెలంగాణ అంతట పండుగ వాతావరణం.. నేడు భవిష్యవాణి కార్యక్రమం..

ఇక, కమలా హారిస్ మాట్లాడుతూ.. తానను ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేసినందుకు బైడెన్ కు ధన్యవాదములు అని పేర్కొన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన అతివాద ‘ప్రాజెక్టు 2025’ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని ఆమె వెల్లడించారు. ప్రకటించారు. అలాగే, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా.. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్‌ కూడా ఆమె నిలిచింది. అధ్యక్షుడి బైడెన్ ఆమోదం పొందడం నేను గౌరవంగా భావిస్తున్నా.. ఈ నామినేషన్‌ను సాధించి, గెలవడమే నా యొక్క ఉద్దేశం అని కమలా హారిస్‌ తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో డెమోక్రాట్లలో పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. జో బైడెన్‌ మద్దతు ఉండడం కమలా హారిస్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.. వచ్చే నెల షికాగోలో జరిగే డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధుల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది.

Exit mobile version