US President Election 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్.. బైడెన్ ఔట్.. !
- అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్..
- డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో కమలా హారిస్..
- కమలా హారిస్ కు మద్దతు తెలిపిన అధ్యక్షుడు జో బైడెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US President Election 2024: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే పోటీలో నిలిచింది. భారతీయ- ఆఫ్రికన్ మూలానికి చెందిన కమలా హారిస్ పేరును బైడెన్ సిఫార్సు చేశారు. ఈ ఏడాది కమలా హారిస్‌ను మా పార్టీ అభ్యర్థిగా చేయడానికి నా పూర్తి మద్దతు, సహకారం అందించాలని కోరుకుంటున్నాను అని జో బైడెన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఏకమై ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది అని బైడెన్ తెలిపాడు.
Read Also: Bhavishyavani: తెలంగాణ అంతట పండుగ వాతావరణం.. నేడు భవిష్యవాణి కార్యక్రమం..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
ఇక, కమలా హారిస్ మాట్లాడుతూ.. తానను ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేసినందుకు బైడెన్ కు ధన్యవాదములు అని పేర్కొన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన అతివాద ‘ప్రాజెక్టు 2025’ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని ఆమె వెల్లడించారు. ప్రకటించారు. అలాగే, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా.. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమె నిలిచింది. అధ్యక్షుడి బైడెన్ ఆమోదం పొందడం నేను గౌరవంగా భావిస్తున్నా.. ఈ నామినేషన్‌ను సాధించి, గెలవడమే నా యొక్క ఉద్దేశం అని కమలా హారిస్ తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో డెమోక్రాట్లలో పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. జో బైడెన్ మద్దతు ఉండడం కమలా హారిస్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.. వచ్చే నెల షికాగోలో జరిగే డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధుల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది.
My fellow Democrats, I have decided not to accept the nomination and to focus all my energies on my duties as President for the remainder of my term. My very first decision as the party nominee in 2020 was to pick Kamala Harris as my Vice President. And it’s been the best… pic.twitter.com/x8DnvuImJV
— Joe Biden (@JoeBiden) July 21, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!