Site icon NTV Telugu

US: రష్యాకు అమెరికా వార్నింగ్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు జరపకపోతే…!

Usrussia

Usrussia

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిపింది. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఇటీవల ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేసి శాంతి చర్చలు జరపాలని కోరారు. అందుకు పుతిన్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే కాల్పుల విరమణకు పుతిన్ ముందుకు రావడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu: కేంద్రం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్

తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల జరపకపోతే రష్యాపై కొత్త ఆంక్షలు పెడతామని హెచ్చరించారు. సెనెట్‌లో మాట్లాడుతూ రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపుపై రష్యా వైఖరి ఏంటనేది ఇంకా తెలియదన్నారు. ఈసారి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ శాంతి చర్చలు జరపడానికి రష్యా ఇష్టపడకపోతే కొత్త ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారన్నారు.

ఇది కూడా చదవండి: Airlines Alert: విమాన ప్రయాణికులకు అలర్ట్.. వర్షాలు కారణంగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తాయని సూచన

ఇటీవల ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతాయని ప్రకటించారు. కాల్పుల విరమణపై చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జెలెన్‌స్కీ స్పందిస్తూ.. రష్యాకు యుద్ధం ముగించే ఉద్దేశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

Exit mobile version