Canada: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపిన కొన్ని రోజుల్లోనే ఆకాశంలో అనుమానాస్పద వస్తువుల గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా కెనడా గగనతంలో మరో అనుమానాస్పద ఉన్న ‘అన్ ఐటెంటిఫైడ్ అబ్జెక్ట్’ను గుర్తించారు.. దీన్ని శనివారం కెనడా, అమెరికా కలిసి కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. యూఎస్ కు చెందిన ఎఫ్- 22 విమానం ఈ వస్తువును కూల్చేసింది. రెండు రోజుల్లో ఇది రెండో ఘటన. కెనడా భద్రతాదళాలు దీనికి సంబంధించిన శకలాలను సేకరించి, విశ్లేషించే పనిలో ఉన్నారు.
Read Also: Sperm Donation: బాబ్బాబు… అది దానం చేయండి ప్లీజ్.. చైనాలో కొత్త ట్రెండ్..
ఈ ఘటనలపై కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తో మాట్లాడారు. చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన తర్వాత అనుమానాస్పద వస్తువులు అమెరికా, కెనడా గగనతలాల్లో కనిపిస్తున్నాయి. ఇవి కూడా చైనా పనేనా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ ఘటనపై అమెరికా, కెనడా అధినేతలు బిడెన్, ట్రూడో శనివారం మాట్లాడుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అలస్కా సరిహద్దుల్లో యూకాన్ ప్రాంతంలో ఈ అన్ఐటెంటిఫైడ్ వస్తువును కూల్చేశారు.
ఇటీవల చైనాకు చెందిన బెలూన్ కూల్చేసిన తర్వాత అమెరికా-చైనా మధ్యలో ఉద్రిక్తత ఏర్పడింది. చైనా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అమెరికా నిందించింది. 5 ఖండాల్లో 40 దేశాలపై చైనా బెలూన్ సాయంతో నిఘా పెట్టిందని.. చైనా ఆర్మీ బెలూన్ ఫ్లీట్ నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతం కూల్చేసిన బెలూన్ లోని పరికరాలను విశ్లేషించే పనిలో ఉంది అమెరికా. ఈ బెలూన్ నిర్మాణానికి సహకరించిన కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చింది. అమెరికాతో పాటు భారత్, జపాన్, వియత్నాం, ఫిలప్పిన్స్ ఇలా పలు దేశాలపై నిఘా పెట్టినట్లు చైనాపై ఆరోపణలు వస్తున్నాయి.