US-Iran War: ట్రంప్‌కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..
- త్వరగా ఒక ఒప్పందానికి రావాలి..
- ఇరాన్‌ను హెచ్చరిస్తూ యూఎస్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
- లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్ ఒక ఒప్పందాన్ని అంగీకరించాలని లేదా యుద్ధం తీవ్రమవుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మంగళవారం హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి రావానే విషయంలో అమెరికా దృఢంగా ఉందని ఆయన అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే మొజ్తబా ఖమేనీ నేతృత్వంలోని కొత్త ఇరాన్ ప్రభుత్వం పాతదాని కంటే వివేకవంతంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో దాడులు తీవ్రంగా ఉంటాయని, ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని హెగ్‌సెత్ అన్నారు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు లేదని, ఇరాన్ నేవీ మొత్తం నిర్వీర్యం అయిందని, ఇరాన్‌తో డీల్ కుదుర్చుకునే ఉద్దేశం ట్రంప్‌కు ఉందని అన్నారు. ఇరాన్ డీల్‌కు ఒప్పుకోకపోతే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ట్రంప్‌కు ఉన్న దమ్ము.. ఎవరికీ లేదు హెగ్‌సేత్ అన్నారు.
Read Also: ACB court: అవినీతి అధికారికి ఏడేళ్లు జైలు, రూ.2 లక్షల జరిమానా
Also Read
ఇరాన్ సైనిక సామర్థ్యాలు గణనీయంగా బలహీనమయ్యాయని, దీని వల్ల నైతిక స్థైర్యం పడిపోయిందని ఆయన అన్నారు. మాకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని, ఇరాక్‌కు తక్కువగా ఉన్నాయని, కేవలం ఒక నెలలో అమెరికా సంఘర్షణ గమనాన్ని మార్చేసిందని ఆయన చెప్పారు. ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతోందని, ఉన్నత స్థాయిలో అసంతృప్తి పేరుకుపోయిందని నిఘా వర్గాలు చెబుతున్నాయని యూఎస్ రక్షణ మంత్రి అన్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్ని ప్రారంభించాయి. తొలి రోజే ప్రస్తుత ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఉన్న మొజ్తబా ఖమేనీ తండ్రి, అప్పటి సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. మరోవైపు, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!