US-Iran War: అమెరికా పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్

  • ఇరాన్ చెరలో అమెరికన్ ఎఫ్-35 పైలట్..
  • ఎఫ్-35 కూల్చివేస్తున్న సమయంలో బయటకు దూకిన పైలట్..
  • తమ చెరలో ఉన్నాడని వెల్లడించిన ఇరాన్ ప్రభుత్వం..
F 35 Shot Down

F 35 Shot Down

US-Iran War: వరల్డ్ మిలిటరీ పవర్ అని అనుకున్న అమెరికాకు ఇరాన్ షాక్ ఇస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక స్టెల్త్ జెట్ ఫైటర్ F-35‌ను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. IRGC ఏరోస్పేస్ ఫోర్స్ దాడిలో దెబ్బతిన్న ఒక F-35 ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధ విమానం కూలిపోతున్న సమయంలో అందులోంచి పారాశ్యూట్ సాయంతో ఎజెక్ట్ అయిన అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫైటర్ జెట్ నుంచి బయటకు దూకిన పైలట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అదుపులో ఉండవచ్చని ఇరాన్ మీడియా ఏజెన్సీ తస్నిమ్ శుక్రవారం నాడు పేర్కొంది. మిస్సింగ్ పైలట్ కోసం అమెరికా హెలికాప్టర్లు గాలిస్తున్నట్లు చెప్పింది.

Read Also: Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

ఒక అమెరికన్ పైలట్‌ తమ చెరలో బంధించినట్లు ఇరాన్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఇప్పటి వరకు అమెరికన్ అధికారులు స్పందించలేదు. అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానంగా పేరొందిన F-35ను ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేయడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఘటనలో పెద్ద శబ్ధంతో పైటర్ జెట్ కూలిపోయిందని, పైలట్ బతికుండే అవకాశాలు తక్కువని మరికొందరు భావిస్తున్నారు. దీనికి ముందు మార్చి 19న ఎఫ్-35 లైట్నింగ్ 2 ఇరాన్ కూల్చివేసినట్లు ప్రకటించింది.