US-Iran Talks: అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు..? ఈసారి ఎక్కడంటే..?
- అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు..
- ఇస్లామాబాద్ లేదా జెనీవాలో జరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేయడానికి యూఎస్ నేవీని దింపారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే, ఈ పరిస్థితుల్లో మళ్లీ చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ అవుట్!
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఇరాన్ తన డిమాండ్లపై సిద్ధంగా ఉంటే త్వరలో చర్చలు ప్రారంభించవచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అయితే, ఈ సమావేశాలు జరిపే వేదికపై చర్చ జరుగుతోంది. మొదటి విడత చర్చలు జరిగిన పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో లేదా స్విట్జర్లాండ్ లోని జెనీవా వేదికగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు చర్చలు కొనసాగినా రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం ముందడుగు పడినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్ చర్చల్లో కొంత వరకు అమెరికా వైపు వచ్చిందని, కానీ పూర్తిస్థాయిలో ఒప్పందాలు కాలేదని చెప్పారు. కొన్ని విషయాల్లో మంచి పురోగతి సాధించిందని, ఇది సరిపోదని అన్నారు. ఈ చర్చల్లో అమెరికా తరుపున జేడీ వాన్స్ పాల్గొంటే, ఇరాన్ తరుపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమాలు, ఆంక్షలు, హార్మోజ్ జలసంధిపై విభేదాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!