Site icon NTV Telugu

US: పాలస్తీనా వధువుకు నరకం.. 140 రోజులు బంధించి ఏం చేశారంటే..!

Palestinianbride

Palestinianbride

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరి కఠినమైన చర్యలకు దిగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలవుతున్నాయి. తాజాగా పాలస్తీనాకు చెందిన ఒక నవ వధువు తనకు ఎదురైన దుస్థితి గురించి విలేకర్ల ముందు గోడువెళ్లబుచ్చుకుంది. తనకెదురైన దుస్థితి ఎవరికీ ఎదురుకాకూడదని వాపోయింది.

ఇది కూడా చదవండి: KTR: అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ కు బేసిన్ లు తెలియదు.. బెండకాయలు తెలియదు

వార్డ్ సకీక్ (22) పాలస్తీనా యువతి. సౌదీ అరేబియాలో జన్మించింది. 8 ఏళ్ల వయసు నుంచి అమెరికాలోనే నివాసం ఉంటుంది. ఇక అమెరికా పౌరుడైన తాహిర్ షేక్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు. ఇక గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లడానికి వీలుండదు. ఆ భయంతోనే హనీమూన్ కోసం బయట ప్రాంతాలకు కాకుండా యూఎస్‌లోని వర్జిన్ దీవులకు వెళ్లారు. హనీమూన్ ముగించుకుని తిరిగి డల్లాస్-ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగారు. అంతే వెంటనే సకీక్‌ను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Rahul Gandi: ట్రంప్ సుంకాలకు మోడీ తలవంచుతారు.. రాసి పెట్టుకోవాలన్న రాహుల్‌గాంధీ

దాదాపు 140 రోజులు సకీక్‌ను నిర్బంధంలో ఉంచేశారు. అంతేకాకుండా చేతులకు సంకెళ్లు వేసి ఆహారం, నీళ్లు ఇవ్వకుండా నాలుగు నిర్బంధ కేంద్రాలకు తరలించారు. తాజాగా ఇదే విషయాన్ని విలేకర్ల ముందు గోడు వెళ్లబుచ్చుకుంది. తాను ఐదు నెలల జీవితాన్ని కోల్పోయాయనని.. అత్యంత దారుణంగా తనను హింసించారంటూ వాపోయింది. కనీసం తినేందుకు ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదని బాధను వ్యక్తం చేసింది. తనకెదురైన దుస్థితి ఎవరికీ ఎదురుకాకూడదని చెప్పుకొచ్చింది. దాదాపు 16 గంటలు బేడీలు వేశారని.. తనను ఒక పశువులా చూశారని చెప్పుకొచ్చింది. భర్తను, న్యాయవాదిని 50 గంటల వరకు కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. తనకెదురైనా పరిస్థితి ఏ ఒక్కరికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version