US: అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం
- అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్
- కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం
- యాప్ ఉపయోగిస్తేనే ఆఫర్ వర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించారు. అక్రమ వలసదారుల్ని పట్టుకుని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపించారు.
తాజాగా అక్రమ వలసదారుల కోసం ట్రంప్ ప్రభుత్వం మరో ప్రత్యేక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్రమ వలసదారుల కోసం ‘‘ఎగ్జిట్ బోనస్ స్కీమ్’’ను ప్రకటించింది. స్వచ్ఛందంగా అమెరికాను వీడేవారికి రూ.2.40 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందిస్తున్నట్లుగా వెల్లడించింది. సీబీపీ హోమ్ యాప్ (CBP Home App) ద్వారా దరఖాస్తు చేసుకుంటే వలసదారులకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. అరెస్ట్‌లు లేకుండా ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ స్కీమ్ ద్వారా స్వదేశాలకు చేర్చనున్నట్లు స్పష్టం చేసింది.
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఉచిత విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. ఆ శాఖ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తాజ్ మహల్ చిత్రాన్ని ఉపయోగించి పత్రాలు లేని భారతీయులు సంప్రదించాలని కోరింది. ‘‘మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇంటికి వెళ్ళవచ్చు! కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) హోమ్ ద్వారా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లినప్పుడు ఉచితంగా ఇంటికి విమాన ప్రయాణం, 2,600 ఎగ్జిట్ బోనస్ పొందండి.’’ అని పోస్ట్‌లో పేర్కొంది.
అక్రమ వలసలను తగ్గించేందుకు ఇది సమర్థవంతమైన మార్గమని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. స్కీమ్‌లో భాగంగా ఎవరినీ అరెస్ట్ చేయకుండా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. “ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్” పేరుతో చేపడుతున్న ఈ పథకం ద్వారా అక్రమ వలసదారులకు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా స్వదేశానికి వెళ్లే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఈ ప్రతిపాదన అమలు అయితే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల సమస్యకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
You can go home with a fresh start!
Receive a FREE flight home and a $2,600 exit bonus when you use CBP Home to self-deport: https://t.co/YGo3uuNvrE pic.twitter.com/ZdSBlrJryO
— Homeland Security (@DHSgov) March 17, 2026
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!