Site icon NTV Telugu

Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

Iran War

Iran War

Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా పరిగణించబడే ‘గ్రీన్ జోన్’లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పెద్ద దాడి జరిగింది. ఇరాక్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఎంబసీ కాంపౌండ్ లోపల ఉన్న హెలిప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత నల్లటిపొగ దట్టంగా అలుముకుంది. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నాయి. యూఎస్ ఎంబసీ వద్ద ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థను ఆత్మాహతి డ్రోన్ దాడి జరిగింది.

Read Also: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, యూఎస్ వైపు నుంచి ఇంకా ప్రాణనష్టం గురించి అధికారిక సమాచారం లేదు. ఈ దాడి వల్ల ఎంబసీలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఖచ్చితమైన వివరాలు అందలేదు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇరాన్ కొత్త సుప్రీంలీడర్, ఇతర కీలక నాయకులపై అమెరికా ఫ్రైజ్ మనీ ప్రకటించిన కొద్ది గంట్లలోనే ఈ దాడి జరిగింది. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అత్యంత సురక్షిత ప్రాంతంగా పరిగణించబడుతుంది. అయితే, ఆ ప్రాంతంలోని హెలిప్యాడ్‌పై మిస్సైల్ అటాక్ జరగడం తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

Exit mobile version