Site icon NTV Telugu

Saudi Prince:హత్య కేసులో సౌదీ యువరాజుకు ఊరట.. కేసును కొట్టేసిన యూఎస్ కోర్టు

Saudi Crown Prince Mohammed Bin Salman

Saudi Crown Prince Mohammed Bin Salman

Saudi Crown Prince Mohammed bin Salman: సౌదీ సంతతికి చెందిన యూఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఊరట లభించింది. ఈ కేసులో సౌదీ యువరాజుకు మినహాయింపులు ఉన్నాయమని జో బైనెన్ యంత్రాంగం పట్టుబట్టడంతో ఈ కేసును కొట్టేసింది న్యాయస్థానం. కొలంబియా డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి జాన్ డీ బేట్స్, మహ్మద్ బిన్ సల్మాన్ కు ఈ కేసు నుంచి రక్షణ కల్పిస్తున్న నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకున్నారు.

Read Also: Minister KTR: కేటీఆర్ తో యుఎస్ హ్యాండ్లూం రీసెర్చ్‌ స్కాలర్‌ భేటీ

ఇటీవల గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని మోదీని అమెరికా రానీయకుండా చేసిన ఆ దేశం, ప్రధాని అయిన తర్వాత రక్షణ కల్పించింది. ఇదే విధంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు కూడా అమెరికా ప్రభుత్వం నుంచి రక్షణ ఉంటుందని ఇటీవల పేర్కొంది. దిగజారుతున్న అమెరికా-సౌదీ అరేబియా సంబంధాలను మళ్లీ పునరుద్ధరించే ఆలోచనతోనే అమెరికా ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాలం సౌదీ క్రమంగా అమెరికాకు దూరం అవుతోంది. ఖషోగ్గీ హత్య ఈ రెండు దేశాల మధ్య దూరం పెంచింది.

అమెరికా సిటిజెన్ షిప్ ఉన్న జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ సౌదీ నుంచి అమెరికా వెళ్తున్న సమయంలో టర్కీ ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా కాన్సులేట్ లో హత్య చేయబడ్డాడు. ఈ హత్యను సౌదీ డెత్ స్వ్కాడ్ గా పిలిచే వ్యక్తులు చేసినట్లుగా అమెరికా ఆరోపించింది. సౌదీ రాజకుటుంబంపై తప్పుగా వార్తలు రాసినందుకే ఖషోగ్గీని ఆ సమయంలో హత్య చేశారు.

Exit mobile version