Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us China Differences Exposed In Delhi Meeting

America And China: ఢిల్లీ మీటింగ్‌లో అమెరికా-చైనా విభేదాలు బహిర్గతం

Published Date :July 10, 2023 , 1:22 pm
By Naga Maneendra
America And China:  ఢిల్లీ  మీటింగ్‌లో అమెరికా-చైనా విభేదాలు బహిర్గతం
  • Follow Us :
  • google news
  • dailyhunt

America And China: అవి రెండూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలు. వాటి మధ్య ఎప్పుడు సఖ్యత ఉండదు. తానే గొప్పంటే.. తానే గొప్పని రెండు దేశాలు ముందుకు సాగుతుంటాయి. ఆ రెండు దేశాలేంటో తెలిసిందిగా.. గుర్తుకు రాలేదా? అమెరికా మరియు చైనా. ఈ రెండు దేశాలు మధ్య విబేధాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒక దేశం విషయంలో మరొక దేశం కలగజేసుకోవద్దని.. రెండు దేశాలు ఒక దేశానికి మరొకటి నిరంతరం హెచ్చరికలు జారీ చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న విబేధాలు ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌లోనూ బహిర్గతం అయ్యాయి.

Read also: Mahankali Bonalu: మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి.. షార్ట్ సర్క్యూట్ తో వ్యక్తి మృతి

అమెరికా-చైనా మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఈ సారి వీరి గొడవకు ఢిల్లీ వేదికగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా.. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో భేటీ అయ్యారు. వీరి భేటీకి ఢిల్లీ వేదికైంది. దీంతో అమెరికా తీరుపై చైన్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్‌ సంబంధిత అంశాల పేరిట అమెరికా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని చైనా హెచ్చరించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి వాంగ్‌ షియావ్‌జియాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘షిజాంగ్‌ (టిబెట్‌ చైనీస్‌ పేరు) మా దేశంలో అంతర్భాగమన్న దాని నిబద్ధతకు కట్టుబడి ఉండేందుకు అమెరికా గట్టి చర్యలు తీసుకోవాలి. షిజాంగ్‌ పేరిట చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలి. దలైలామా బృందం చేపట్టే చైనా వ్యతిరేక కార్యకలాపాలకు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు. ‘‘షిజాంగ్‌ వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గతమైనవి. వీటిల్లో బాహ్య శక్తుల జోక్యానికి ఎటువంటి అర్హత లేదు. టిబెట్‌ స్వాతంత్ర్యం కోరుకొనే శక్తులు.. విదేశీ దౌత్యవేత్తల మధ్య ఎటువంటి సంబంధాలనైనా చైనా బలంగా వ్యతిరేకిస్తుంది’’ అని చైనా ప్రతినిధి తేల్చి చెప్పారు.

Read also: RRR Sequel Update: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. డైరెక్టర్ రాజమౌళి కాదా?

అమెరికా ఉన్నతాధికారి ఉజ్రా జియాకు అక్కడి ప్రభుత్వం ‘టిబెట్‌ వ్యవహారాల సమన్వయకర్త’ హోదా ఇవ్వడం కూడా పూర్తిగా నేరపూరితమని పేర్కొన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, టిబెట్‌లో అభివృద్ధి, స్థిరత్వాన్ని తక్కువ చేసి చూపడానికి తీసుకొన్న చర్యగా అభివర్ణించారు. టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని పూర్తిగా వేర్పాటువాద రాజకీయ సంఘంగా చైనా ప్రతినిధి పేర్కొన్నారు. అది చైనా చట్టాలకు వ్యతిరేకమన్నారు. దానికి ప్రపంచంలో ఏ దేశం గుర్తింపు లభించలేదని తెలిపారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా తన భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో దలైలామాతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రవాస టిబెట్‌ ప్రభుత్వం కోసం పనిచేసే సెంట్రల్‌ టిబెటియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. ఉజ్రా జియా జులై8 నుంచి 14వ తేదీ వరకు భారత్‌, బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె భారత్‌లోని ఉన్నతాధికారులను కూడా కలవనున్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట అమెరికా విదేశాంగ సహాయ మంత్రి డొనాల్డ్‌ లూ కూడా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • china
  • Delhi Meeting
  • differences
  • Exposed

తాజావార్తలు

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

  • Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions