US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-China AI Tech War: అమెరికా – చైనా మధ్య టెక్నాలజీ పోరు కొత్త మలుపు తిరిగింది. ఈ రెండు దేశాల మధ్య మరోసారి టెక్నాలజీ యుద్ధం మొదలైంది. ఈసారి కృత్రిమ మేధ (AI) వేదికగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డీప్‌సీక్ (DeepSeek) వంటి చైనీస్ కంపెనీలు అమెరికాకు చెందిన AI సాంకేతికతను చోరీ చేస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్‌ను చైనా కంపెనీలు కాపీ కొడుతున్నాయంటూ అమెరికా విదేశాంగ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా DeepSeek, Moonshot AI, MiniMax వంటి కంపెనీలు అమెరికన్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన దౌత్యవేత్తలకు అమెరికా కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా ఆగ్రహం ఎందుకంటే..
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. చైనీస్ కంపెనీలు అమెరికాకు చెందిన అధునాతన AI మోడల్స్ నుంచి డేటాను దొంగిలించి, వాటిని తమ స్వంత మోడల్స్‌గా మార్చుకుంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఈ చైనా మోడల్స్ తక్కువ ఖర్చుతో మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, ఒరిజినల్ మోడల్స్‌లో ఉండే భద్రతా ప్రమాణాలు, నిష్పాక్షికత వీటిలో ఉండవని అమెరికా హెచ్చరిస్తోంది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మోడల్స్ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు వివాదమంతా AI Distillation అనే ప్రక్రియ చుట్టూ తిరుగుతోంది. ఇది ఏంటంటే.. భారీ పెట్టుబడితో రూపొందించిన పెద్ద AI మోడల్స్ (ఉదాహరణకు ChatGPT) ఇచ్చే అవుట్‌పుట్‌ను ఉపయోగించి, అతి తక్కువ ఖర్చుతో చిన్న మోడల్స్‌ను తయారు చేయడాన్నే డిస్టిలేషన్ అంటారు. అనుమతి లేకుండా తమ డేటాను వాడుకుంటూ OpenAI వంటి సంస్థల మోడల్స్‌ను చైనా కంపెనీలు కాపీ చేస్తున్నాయని అమెరికా చట్టసభ సభ్యులకు ఫిర్యాదులు అందాయి.
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ట్రంప్ పర్యటన వేళ పెరుగుతున్న ఉత్కంఠ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న తరుణంలో ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం. గత అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య టెక్నాలజీ ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపించినా, తాజా AI వివాదం మళ్లీ వాతావరణాన్ని వేడెక్కించింది. మరోవైపు ఈ ఆరోపణలను చైనా కొట్టిపారేస్తోంది. తాము మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తామని చెప్తూనే.. ఇటీవల DeepSeek సంస్థ హువావే చిప్‌ల కోసం కొత్త AI మోడల్‌ను విడుదల చేసి తన సాంకేతిక స్వావలంబనను చాటుకుంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే, రాబోయే రోజుల్లో ప్రపంచ టెక్ రంగంలో మరిన్ని సంచలనాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..