Site icon NTV Telugu

Gaza: ఆఫ్రికాకు పాలస్తీనా ప్రజలు.. యూఎస్, ఇజ్రాయిల్ ప్లాన్..

Gaza

Gaza

Gaza: పాలస్తీనియన్లను గాజా నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్, అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆఫ్రికా దేశాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మూడు ఆఫ్రికా దేశాల్లో వీరికి పునరావాసం కల్పించడానికి చర్చిస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ యూఎస్, ఇజ్రాయిల్ అధికారుల్ని ఉటంకిస్తూ నివేదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి సుడాన్, సోమాలియా, సోమాలిలాండ్‌తో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తున్నారు.

Read Also: Tamil Nadu assembly: రూపాయి సింబల్ మార్పు, మద్యం కుంభకోణం.. సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్..

అయితే, అమెరికా ప్రతిపాదనని తిరస్కరించినట్లు సూడాన్ అధికారులు తెలిపారు. సోమాలియా, సోమాలిలాండ్ అధికారులు దీనిపై తమకు సమాచారం లేదని చెప్పారు. ఈ విషయంపై వైట్ హౌజ్, యూఎస్ స్పందన గురించి రాయిటర్స్ అభ్యర్థనలపై విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. ఈ నెల ప్రారంభంలో, అరబ్ నాయకులు గాజా కోసం 53 బిలియన్ డాలర్ల ఈజిప్షియన్ పునర్నిర్మాణ ప్రణాళికను ఆమోదించారు. దీని ద్వారా గాజా ప్రజలు గాజా నుంచి తరలించకుండా ఉండేందుకు ఆమోదం తెలిపారు. ఇది అమెరికా ప్రతిపాదనకు విరుద్ధంగా ఉంది.

గత 17 నెలల్లో ఇజ్రాయిల్ సైనిక దాడిలో వేల సంఖ్యలో గాజా ప్రజలు చనిపోయారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, గాజన్లను తీసుకోవాలని జోర్డాన్‌తో పాటు అరబ్ దేశాలను కోరారు. అయితే, ఇందుకు వీరు ఒప్పుకోలేదు. యుద్ధంలో నాశనమైన గాజాను పునర్నిర్మించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రతిపాదనల్ని గాజాలోని హమాస్ మిలిటెంట్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Exit mobile version