Oxygen-28: ఆక్సిజన్ కొత్త రూపాన్ని కనుగొన్న సైంటిస్టులు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oxygen-28: శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కొత్త రూపాన్ని ‘ఆక్సిజన్-28’ని కనుగోన్నారు. ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన దాని కన్నా ఎక్కువ న్యూట్రాన్లను కలిగి ఉంది. జపాన్ లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికి చెందిన అణు శాస్త్రవేత్త యోసుకే కోండో నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఆక్సిజన్-28ని కనుగొంది.
ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన అత్యధిక సంఖ్యలో న్యూట్రాన్లు ఈ ఆక్సిజన్-28 కలిగి ఉంది. ఇది ఇప్పటి వరకు చూసిన ఆక్సిజన్ రూపాల్లో భారీదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆక్సిజన్ -28 అనూహ్యంగా అధిక న్యూట్రాన్-టూ-ప్రోటాన్ నిష్పత్తిని కలిగి ఉంది, ఇది చాలా అరుదు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు కలిగిన న్యూక్లియాన్ అనే సబ్‌అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని పరిశోధకులు బృందం చెబుతోంది. ఒక మూలకం యొక్క అటామిక్ నెంబర్ ప్రోటాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. న్యూట్రాన్ల సంఖ్య మాత్రం మారవచ్చు. న్యూట్రాన్ల సంఖ్య ఆ మూలకం యెక్క ఐసోటోపులను ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ 8 ప్రోటాన్లను కలిగి ఉంటుంది, అయితే న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉండొచ్చు.
అంతకుముందు సైంటిస్టులు ఆక్సిజన్-26ని కనుగొన్నారు. దీనిలో 8 ప్రోటాన్లు ఉంటే 18 న్యూట్రాన్లు మొత్తం న్యూక్లియాన్ 26కి సమానం. అయితే తాజాగా కనుగొన్న ఆక్సిజన్-28లో ప్రోటాన్లు 8, న్యూట్రాన్లు 20 ఉన్నాయి. సాధారణంగా భూమిపై ఉండే, మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్, ఆక్సిజన్-16 రూపంలో ఉంటుంది.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!