UN Warns: 48 గంటల్లో గాజాలో 14 వేల మంది పిల్లలు చనిపోవచ్చు.. యూఎన్ హెచ్చరిక
- 48 గంటల్లో గాజాలో 14 వేల మంది పిల్లలు చనిపోవచ్చు
- ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా పరిస్థితి దయనీయంగా మారింది. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా మానవతా సాయం నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లభించక విలవిలలాడిపోతున్నారు. దీంతో యూఎన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే ఆహారం అందకపోతే వేలల్లో పిల్లలు చనిపోతారని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 28 మంది మావోల హతం.. మృతుల్లో అగ్రనేత!
Also Read
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
- America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
- Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ నాశనం చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. ప్రజలకు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇక చిన్న పిల్లల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. పోషకాహార లోపంతో పిల్లలు కృషించి పోతున్నారు. యుద్ధం కారణంగా స్వచ్చంధ సంస్థలు అందించే ఆహారం నిలిచిపోవడంతో గాజాలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సరైన వైద్యం అందక కూడా నీరసించి పోయారు. దీంతో తాజాగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. సోమవారం ఐదు ట్రక్కుల ఆహారం మాత్రమే గాజాలోకి ప్రవేశించాయని యూఎన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయడమే
గాజాలో దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆహారం పంపిణీకి అనుమతి ఇచ్చారు. అయితే కొద్ది ఆహారమే చేరడంతో మరింత మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లో ఆహారం చేరకపోతే 14 వేల మంది చనిపోవచ్చని యూఎన్ హెచ్చరించింది. దాదాపు 11 వారాల పాటు గాజాను ఇజ్రాయెల్ పూర్తి దిగ్బంధించింది. దీంతో పాలస్తీనియన్లకు ఆహారం లభించలేదు. అయితే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే వంటి మిత్ర దేశాల ఒత్తిడితో ఆదివారం స్వల్పంగా నెతన్యాహు అనుమతి ఇచ్చారు. మిత్ర దేశాలు తీవ్రంగా విమర్శించడంతో నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఓ వైపు నెతన్యాహు స్వల్ప అనుమతి ఇచ్చినా.. ఇంకోవైపు భీకరమైన దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ వారంలో జరిగిన దాడుల్లో వందల కొద్ది పాలస్తీనియర్లు చనిపోయారు. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే నెతన్యాహు ప్రకటించారు. ఆ దిశగానే ఐడీఎఫ్ సాగుతోంది.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!