Site icon NTV Telugu

Gaza-Israel: గాజాపై భీకరదాడులకు ఇజ్రాయెల్ ప్లాన్.. యూఎన్ ఆందోళన

Gaza

Gaza

గాజాను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గాజా స్వాధీనాని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గాజాపై ఆపరేషన్‌కు ముందు మరో 60,000 మంది రిజర్విస్టులను సైన్యంలోకి పలిచింది. దీంతో రిజర్విస్టుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంటుంది. గాజాలోని అనేక ప్రాంతాల్లో హమాస్ నాయకులు తిష్టవేసినట్లుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి భీకర దాడులు చేసేందుకు ఐడీఎఫ్ ప్రణాళికలు రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన

అయితే ఇజ్రాయెల్ చర్య అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. తాజా ప్రణాళికతో మరింత మరణాలు, విధ్వంసం జరుగుతుంందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తక్షణమే కాల్పుల విరమణకు ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జపాన్‌లో ఆఫ్రికన్ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆంటోనియో కోరారు. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలను కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ స్థిరనివాస నిర్మాణాన్ని విస్తరించాలనే నిర్ణయాన్ని ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: B Sudershan Reddy: ప్రతిపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి నామినేషన్

ఇదిలా ఉంటే ఐడీఎఫ్ దళాలు.. పలు ప్రాంతాల్లో పాలస్తీనీయులను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనతో ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడుతున్నట్లు సమాచారం.

Exit mobile version