ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నది. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కొన్ని పరిష్కారాలను సూచిస్తూ రష్యాకు లేఖ రాసింది అమెరికా. అయితే, దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు. సోవియట్ యూనియన్ దేశాల నుంచి విడిపోయిన దేశాలకు నాటోలో చేర్చుకోకూడదు అన్నది రష్యా వాదన. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి నాటోలో చేర్చుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, యూరప్ కు చెందిన కొన్ని దేశాలు రష్యా డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.
Read: తెరుచుకున్న చైనా..ఉత్తరకొరియా సరిహద్దులు…
ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడానికి పావులు కదుపుతున్నాయి. కొన్ని మాత్రం ఈ విషయంలో చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయిని, ఉక్రెయిన్, రష్యా దైత్య అధికారులతో ఫ్రాన్స్ అధ్యక్షుడి నివాసంలో చర్చలు జరిగాయి. రెండు వారాల్లో మరోసారి చర్చలు జరపనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఫ్రాన్స్ అమెరికాకు వంత పాడటం లేదు. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఫ్రాన్స్, అమెరికా మధ్య దూరం మరింతగా పెరిగింది. అటు జర్మనీ కూడా రష్యా విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తున్నది. మొత్తానికి ఉక్రెయిన్ సంక్షోభం యూరప్‌లో చిచ్చురేపుతున్నదని చెప్పుకోవచ్చు.
