Ukraine Russia War: ఉక్రెయిన్‌పై డ్రోన్లతో భీకర దాడులు చేస్తుంది రష్యా. ఈ సందర్భంగా కీవ్ సర్కార్ ఈ దాడులను అడ్డుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మాస్కో నుంచి వచ్చే డ్రోన్‌లను కూల్చడానికి సైన్యం ప్రమేయం లేకుండా వాలంటీర్లను ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తుంది. ఇందు కోసం వారికి కొంత నగదును ఇవ్వడానికి రెడీ అయింది. ఇక, రష్యా నుంచి వచ్చే డ్రోన్‌లను అడ్డుకునే పౌరులకు నెలకు రూ.2.2 లక్షలను అందిస్తామని తెలిపింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి ఉక్రెయిన్ మంత్రివర్గ ఆమోదం లభించింది. అయితే, స్థానిక బడ్జెట్ నుంచి ఈ చెల్లింపులు కొనసాగుతాయని.. మార్షల్ లా ఉండే రెండేళ్ల వరకు ఈ పథకం అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు.
Read Also: Flying Buses: ఢిల్లీ, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య.. ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్..
అయితే, ఈ డ్రోన్ రక్షణ కార్యక్రమానికి సంబంధించి శిక్షణ పొందిన వాలంటీర్లను, డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కలిగిన పారా మిలిటరీ సభ్యులను ఎంపిక చేసింది. వారు మానవ రహిత విమానాలు, ఆయుధాలు లాంటి వాటిని ఉపయోగించి మాస్కో నుంచి వస్తున్న డ్రోన్‌లను నేల కూల్చాలి.. దీంతో రష్యా నుంచి వచ్చే ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఉక్రెయిన్ సర్కార్ భావిస్తుంది.
ఇక, రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్ దాడులు కీలకంగా మారాయి. నిఘా, వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కీవ్ విద్యుత్ వ్యవస్థలను, అక్కడి ప్రజల మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగించేందుకు ఇరాన్‌కు చెందిన షహీద్ డ్రోన్లను రష్యా భారీగా ఉపయోగిస్తు్న్నట్లు సమాచారం. అయితే, ఉక్రెయిన్ కూడా తన డ్రోన్ వ్యవస్థను భారీగా విస్తరించింది. ఇటీవల ‘స్పైడర్ వెబ్’ పేరుతో రష్యాపై ఉక్రెయిన్ భారీస్థాయిలో దాడులకుదిగింది.
