Iran War: గల్ఫ్ దేశాలకు రక్షణ.. ఇరాన్ యుద్ధంలోకి ఉక్రెయిన్ ఎంట్రీ..
- గల్ఫ్ దేశాలకు రక్షణగా రంగంలోకి దిగిన ఉక్రెయిన్..
- ఇరాన్ షాహెద్ డ్రోన్ల నుంచి రక్షణ కోసం మోహరింపు..
- సౌదీ, ఖతార్, యూఏఈలతో జెలెన్స్కీ కీలక ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధంలోకి ఉక్రెయిన్ దిగింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, బహ్రైయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, కీలక ఆయిల్-గ్యాస్ క్షేత్రాలపై మిస్సైల్, డ్రోన్ అటాక్స్ చేస్తోంది. అయితే, వీటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ రంగంలోకి దిగింది. ఇరాన్ నుండి వచ్చే షాహెద్ డ్రోన్ల నుండి రక్షణ కల్పించేందుకు, తమ దేశానికి చెందిన 200 మందికి పైగా యాంటీ డ్రోన్ నిపుణులు ప్రస్తుతం సౌదీ అరేబియా, యూఏఈలలో మోహరించి ఉన్నారని ఉక్రెయిన్ పేర్కొంది.
ఈమేరకు గల్ఫ్ దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ సౌదీ వెళ్లారు. ఉక్రెయిన్‌ను రక్షణ సాంకేతిక పరిజ్ఞానానికి ఒక నమ్మకమైన ప్రపంచ సరఫరాదారుగా ఉందని ఆయన అన్నారు. రష్యాతో నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకునే ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. తక్కువ ఖర్చుతో ఈ వ్యవస్థల్ని అభివృద్ధి చేసింది. రష్యా డ్రోన్లను కూల్చివేసే వాయు రక్షణ వ్యవస్థగా ఉక్రెయిన్ తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ ఇంటర్‌సెప్టర్‌లు, ఎలక్ట్రానిక్ జామింగ్ పరికరాలను డెవలప్ చేసింది.
Also Read
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
Read Also: MLA Arava Sridhar controversy: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహ*త్య చేసుకుంటా..!
ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ సత్తా గల్ఫ్ దేశాలకు అర్థమైంది. దీంతో ఉక్రెయిన్-సౌదీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ రష్యాకు ఈ షాహెద్ డ్రోన్లను అందించింది. అయితే, ఉక్రెయిన్ వీటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ వ్యవస్థల కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, జోర్డాన్ దేశాలకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి చేయడానికి ఉక్రెయిన్ సిద్ధమైంది. ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగిస్తున్న 20 వేల నుంచి 50 వేల డాలర్ల ధర కలిగిన డ్రోన్లను కూల్చివేయడానికి గల్ఫ్ దేశాలు 4 మిలియన్ డాలర్లు ఉన్న అమెరికన్ పేట్రియాట్ వ్యవస్థల్ని వాడాల్సి వస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల్ని అడ్డుకునేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, రష్యా ప్రయోగిస్తున్న ఈ షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్ 97 శాతం ఖచ్చితత్వంతో ఛేదిస్తోంది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు ఈ దేశాలు ఇరాన్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఉక్రెయిన్ సాయం తీసుకుంటున్నాయి.
We have reached an important Arrangement between the Ministry of Defense of Ukraine and the Ministry of Defense of the Kingdom of Saudi Arabia on defense cooperation. The document was signed ahead of our meeting with the Crown Prince of Saudi Arabia, Mohammed bin Salman Al Saud.… pic.twitter.com/j3aXzLXSNr
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 27, 2026
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!