NTV Telugu Site icon

Plane Crash: విమానంపై రంధ్రాలు.. అజర్‌ బైజన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రమాదంలో కుట్రకోణం..?

Plane

Plane

Plane Crash: అజర్‌ బైజన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలిపోవడంతో 38 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో పలు కుట్రకోణాలు బయటకు వస్తున్నాయి. అయితే, అజర్‌ బైజన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్‌ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజఖ్‌స్థాన్‌లోని ఆక్టావ్‌లో ఈ విమానం కూలింది. పక్షి ఢీ కొట్టడంతో పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్‌ వెల్లడించింది. కాగా, ప్రమాద దృశ్యాలపై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్లెన్ కూలిన సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య దాడులు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ విమానాన్ని కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించడంతోనే రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: IRCTC: ఐఆర్‌సీటీసీ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను రష్యా తిప్పికొడుతున్న తరుణంలోనే పైలట్‌ అప్రమత్తమై ఓ కాల్‌ పంపించారని కొన్ని వార్త సంస్థల కథనాలు తెలిపాయి. అలాగే, కొన్నిచిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్లు ఉన్న ఆనవాళ్లు కనిపించినట్లు పేర్కొంటున్నాయి. అయితే, ఈ కథనాలపై కజఖ్‌స్థాన్‌ డిప్యూటీ ప్రధానినీ మీడియా ప్రశ్నించిన సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే, నిన్న క్రిస్మస్ పండగ సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగించింది. ఆ దేశంలోని పలు విద్యుత్తు కేంద్రాలపై 70కి పైగా క్షిపణులు, 100కుపైగా డ్రోన్లతో దాడులు చేసింది.

Show comments