Ovarian Cancer: ప్రాణం మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు మన ముందు వున్నవారు.. ఒక్కక్షణంలోనే మృత్యు ఓడిలో చేరుకుంటున్నారోజులివి. అందుకే వున్నరోజులు ఆనందంగా గడపాలి అంటుంటారు కొందరు. సంపాదన ముఖ్యమే.. జీవించడానికి డబ్బు అవసరమే కానీ.. డబ్బులు ఎంత సంపదించినా.. ఎన్ని బిల్డింగులు కట్టినా.. చివరకు చేరాల్సింది ఆ.. ఐదుఅడుగుల సమాదిలోనే.. మన ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాము కానీ.. మనలోని అనారోగ్య పరిస్థితులు తెలుసుకునే లోపే మనజీవితం చేజారిపోతుంది. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అలాంటిదే..
ఆమె వయస్సు 39 సంవత్సరాలు. నెలల తరబడి ఆమె పొట్ట కాస్త పెరుగుతూ వస్తుంది. అది గమనించిన ఆమె గర్భం వచ్చినట్లు సంతోషపడింది. అప్పుడప్పు ఆమెను అనుమానం వచ్చేది. అయినా ఏదో ఒక చిన్న ఆశ. కానీ ఆమెకు కడుపు ఉబ్బరంగా ఉండటం నీరసంగా ఉండటం.. అజీర్ణం, అతిగా తినడం లేదా ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లేదా పీరియడ్స్ వల్ల కావచ్చు అనుకుంది. ఈ కారణాలు.. మనిషిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటాయి అనుకుంది. కానీ.. కొన్నిసార్లు నొప్పి విపరీతంగా ఉంటుందుకుంది. కానీ నొప్పి భరించలేక చివరకు వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షలు చేసిన డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పడంతో.. ఆమె నిర్ఘాంతపోయింది. కాసేపు ఏంచేయాలో ఆమెను అర్థం కాలేదు. గర్భం అనుకుంటే ప్రాణాలకే ముప్పు వచ్చిందా? అంటూ ఆమె కంటినుంచి కన్నీటిధారలు ఆగలేదు. ఈఘటన యూకేలోని హడర్స్ ఫీల్డ్ లో చోటుచేసుకుంది.
యూకేలోని హడర్స్ ఫీల్డ్ కు చెందిన ఓ మహిళ కూడా కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికి వెళ్లింది. తొమ్మిది నెలల గర్భవతిగా కనిపించింది. పలు రకాల పరీక్షలు చేయించుకున్న ఆమె అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. 39 ఏళ్ల హన్నా చాలా ఏళ్లుగా కడుపు ఉబ్బరంతో బాధపడుతోంది. ఈ సమస్య కారణంగా ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా కనిపిస్తోంది. పెద్ద బొడ్డు చూడ్డానికి అసహ్యంగా సిగ్గుగా ఉంది. ఒత్తిడికి గురైన ప్రేగు కదలికలు ఆమెను మరింత బాధకు గురిచేస్తున్నాయి, తలతిరగడం, అసౌకర్యంగా అనిపించడం, వంగడానికి కూడా ఇబ్బంది, కడుపునొప్పి తీవ్ర సమస్యలను కలిగించాయి. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆమెకు అండాశయ క్యాన్సర్ అని తేలింది. మూడో దశలో ఉన్నప్పుడే ఆమెకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కడుపులో అసౌకర్యం కారణంగా ఆమె ఏప్రిల్ 2019 నుండి పండ్లు, కూరగాయలు తినడం మానేసింది. దీంతో ఆమె కడుపు మరింత కలత చెందింది. నేను ఇన్నాళ్లు గర్భవతి అనుకున్నా కానీ.. నా ప్రాణమే ఉండదని తెలిసింది అంటూద ఆమె కన్నీరుమున్నీరవడంతో.. ఆసుపత్రి ప్రాంగణం అంతా ఆమెను చూసి కన్నీరు పెట్టుకున్నారు.
Curd With Sugar: మీకు పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉందా?