Tomato Shortage: యూకేలో తీవ్రంగా టొమాటోల కొరత.. ఖాళీగా సూపర్ మార్కెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Shortage: ఆర్థిక మందగమనంతో ఇప్పటికే యూకే ఇబ్బందులు పడుతోంది. రానున్న రోజుల్లో ఆర్థికమాంద్యం తప్పదా అనే అనుమానాలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ దేశాన్ని టొమాటోల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం యూకేలోని సూపర్ మార్కెట్లలో టొమాటో స్టాల్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also: Eggs And Paneer : ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా.. ఇలా ప్రయత్నించండి
Also Read
ఇంతగా యూకేను టొమాటో కొరత వేధించడానికి కారణం వాతావరణ ప్రభావమే. యూకేకు ఎక్కువగా దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా నుంచి టొమాటోలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా మొరాకో, స్పెయిన్ దేశాల నుంచి యూకేకు ఎక్కువగా టొమాటోలు వస్తుంటాయి. అయితే వేడి వాతావరణం వల్ల పంట దిగుబడి తగ్గింది. ఇదిలా ఉంటే ఇటీవల చల్లని వాతావరణ ఫలితంగా పంట కాలం ఎక్కువ అవుతోంది. దీంతో టొమాటోలకు తీవ్ర కొరత ఏర్పడింది.
మొరాకోలో తీవ్ర వరదలు, వర్షాలు, చల్లని వాతావరణం పంటలపై తీవ్ర ప్రభావం చూపెట్టాయి. ఇలాగే స్పెయిన్ లో గత మూడు నాలుగు వారాల నుంచి ఉన్న వాతావరణం కూడా కొరతకు కారణం అయింది. భారీ వర్షాల కారణంగా ఫెర్రీ రద్దు, రవాణా అంతరాయాలు కూడా యూకే మార్కెట్ లోకి టొమాటోలను తీసుకురావడానికి ఇబ్బందికరంగా మారాయి. దక్షిణ యూరప్ మరియు ఉత్తర ఆఫ్రికాలోని క్లిష్ట వాతావరణ పరిస్థితులు టమోటాలతో సహా కొన్ని పండ్లు మరియు కూరగాయల పంటలకు అంతరాయం కలిగించాయని బ్రిటిష్ రిటైల్ కన్సార్టియంలో ఫుడ్ అండ్ సస్టెనబిలిటీ డైరెక్టర్ ఆండ్రూ ఓపీ చెప్పారు.
Why do we think this is happening? https://t.co/6JtDhCZrjp
— Deborah Meaden 🇺🇦 (@DeborahMeaden) February 19, 2023
తాజావార్తలు
-
Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
PM Modi’s Big Call to India: భవిష్యత్ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి.. ప్రధాని మోడీ
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!