Site icon NTV Telugu

Keir Starmer: అక్టోబర్‌లో భారత్‌కు రానున్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్!

Keir Starmer

Keir Starmer

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్‌టెక్ సమావేశంలో కూడా కీర్ స్టార్మర్ పాల్గొంటారని సమాచారం.

ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను అందుకే చంపేశా.. నిందితుడు కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోడీ ఇటీవల లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫిన్‌టెక్‌పై ఒప్పందాలు జరిగాయి. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌కు రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వేసవిలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా అప్పుడు సాధ్యం కాలేదు. దీంతో అక్టోబర్ చివరి నాటికి పర్యటన ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi at 75: 75వ బర్త్‌డే చేసుకుంటున్న మోడీ.. రాజకీయ ప్రస్థానమిదే!

ఫిన్‌టెక్ సమావేశంలో భాగంగా కీర్ స్టార్మర్ ముంబైలోనే ఉండొచ్చని వర్గాలు భావిస్తున్నాయి. గత సంవత్సరంలో ప్రధాని మోడీ-కీర్ స్టార్మర్ అనేక సార్లు కలిశారు. ఇక గత జూలైలో కూడా మోడీ లండన్‌లో పర్యటించారు. బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని భావించారు. ఇక పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్-3ని మోడీ కలిశారు. ఈ సందర్భంగా మోడీకి చార్లెస్ ప్రత్యేక విందు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Trump: యూకే టూర్‌లో ట్రంప్‌కు చేదు అనుభవం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న ఫొటోలు ప్రదర్శన

Exit mobile version