NTV Telugu Site icon

UK: ట్రంప్ బాటలోనే యూకే.. భారత్ లక్ష్యంగా వలసదారులు ఏరివేత

Uk

Uk

అమెరికా బాటలోనే యూకే ప్రభుత్వం వెళ్తోంది. అక్రమంగా ఉంటున్న భారతీయులకు బేడీలు వేసి మరీ అమెరికా తిరిగి పంపించేస్తోంది. తాజాగా అదే బాటలో బ్రిటన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని యూకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడుగురు కార్మికులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Sreeleela : బాలీవుడ్ ఆఫర్ పట్టిన కిస్సిక్ క్వీన్

‘యూకే వైడ్ బ్లిట్జ్‌’ పేరుతో వలసదారులు పని చేసే భారతీయ రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున పోలీసులు, అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే కార్‌ వాష్‌ ఏరియాలు, కన్వీనియెన్స్‌ స్టోర్‌లు, బార్‌లపై కూడా తనిఖీలు చేపట్టి ఇప్పటి వరకు వందల మందిని అరెస్టు చేసింది. ఇక హంబర్‌సైడ్‌ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?

గతేడాది జులైలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం.. బోర్డర్‌ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు 19,000 మంది విదేశీ నేరస్థులు, అక్రమ వలసదారులను పట్టుకున్నట్లుగా యూకే ప్రభుత్వం చెబుతోంది. బ్రిటిష్ హోం కార్యదర్శి య్వెట్ కూపర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించడంతో జనవరిలో రికార్డు స్థాయిలో 828 ప్రాంగణాల్లో దాడులు నిర్వహించినట్లుగా నివేదించింది. గత సంవత్సరం కంటే 73 శాతం అరెస్ట్‌లు జరిగినట్లుగా పేర్కొంది.